Intinti Gruhalashmi: నాన్నను అలా అనకూడదు అంటూ దివ్యను మందలించిన తులసి.. లాస్య కొడుకును వేడుకున్న నందు!

Published : May 17, 2022, 01:42 PM IST

Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalashmi: నాన్నను అలా అనకూడదు అంటూ దివ్యను మందలించిన తులసి.. లాస్య కొడుకును వేడుకున్న నందు!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంటికి వచ్చిన దివ్య (Divya) ఫీజు కట్టడానికి డాడీ కాలేజీకి వచ్చారు అని చెబుతుంది. ఆయనకు నీ మీద ఎఫెక్షన్ లేనప్పుడు..  మా మీద కూడా ఎఫెక్షన్ లేనట్టే అని అంటుంది. అంతేకాకుండా నా ఫీజు మీరు కట్టనవసరం లేదు అని తెగేసి చెప్పాను అని దివ్య అంటుంది.
 

26

ఇక తులసి (Tulasi) ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకు అది నా పెంపకనికి అవమానం అని అంటుంది. ఇక దివ్య (Divya) అమ్మ ని ప్రేమించని నాన్న నాకు ఒద్దు అంటుంది. ఇక తులసి నా గురించి తండ్రి కూతుర్లు విడిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది.  మరోవైపు లాస్య కొడుకు నందుని చూసి భయపడుతూ ఉంటాడు.
 

36

ఇక నందు (Nandu) నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతాడు. నీ మొహం చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఒక మా అమ్మకు తప్ప అని అంటాడు. దానికి నందు చిన్నగా నవ్వుతాడు. అంతేకాకుండా మా మమ్మీని నాకు వదిలేసి మీరు వెళ్లిపోండి అని అంటాడు. మరోవైపు ప్రేమ్ (Prem) ఇంటి ఓనర్ తో తగువు పెట్టుకుంటాడు.
 

46

ఇక శృతి (Shruthi) ఎంతో భయపడుతుంది. మరోవైపు తులసి పార్క్ లో యోగా చేస్తూ ఉంటుంది. తులసి (Tulasi) ముందు ఇద్దరు పిల్లలు సరిగమప అంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. తులసి కూడా వాళ్లతో ఆనందంగా పాడుతూ ఉంటుంది. ఈలోగా అక్కడకు ఆ పిల్లల తల్లి వచ్చి మా పిల్లలకు సంగీతం నేర్పిస్తారా అని అడుగుతుంది.
 

56

ఆ సమయంలో తులసికి (Tulasi) ప్రవలిక అన్న మాటలు గుర్తుకు వస్తాయి. దాంతో తులసి ఎంతో ఆనంద పడుతుంది. ఇక తులసి మీ అడ్రస్ ఇవ్వండి ఫోన్ చేసి వస్తాను అని ఆ తల్లి కి చెబుతుంది. మరోవైపు పరందామయ్య దివ్య (Divya) లు చందరంగం ఆడుతూ ఉంటారు.
 

66

ఇక తరువాయి భాగంలో తులసి (Tulasi) పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉంటుంది. ఇక లాస్య ఆ గొంతు వింటుంటే నాకు కూడా నేర్చుకోవాలి అనిపిస్తుంది అని అక్కడికి వెళ్లగా తులసి కనిపిస్తుంది. దాంతో లాస్య (Lasya) ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత నందు నా జాబ్ పోయిందని  లాస్య కు చెబుతాడు.

click me!

Recommended Stories