Ariayan Marriage: వరుడు సిద్ధం నవంబరులో అరియనా వివాహం... బిగ్ బాస్ హౌస్ నుండే ప్రకటన!

Published : May 17, 2022, 12:44 PM ISTUpdated : May 17, 2022, 12:45 PM IST

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న యాంకర్ అరియనా పిచ్చ పాప్యులర్ అయ్యారు. అద్భుతమైన గేమ్, బోల్డ్ యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసులు దోచింది. సీజన్ 4 (Bigg boss Telugu 4) ఫైనల్ కి చేరిన అరియానా టైటిల్ రేసులో నిలిచింది. సీజన్ 4 టైటిల్ అభిజీత్ గెలుచుకోగా... అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. 

PREV
16
Ariayan Marriage: వరుడు సిద్ధం నవంబరులో అరియనా వివాహం... బిగ్ బాస్ హౌస్ నుండే ప్రకటన!
Ariayan glory

బిగ్ బాస్ (Bigg boss) షో తర్వాత అరియనా బుల్లితెర అవకాశాలు దక్కించుకున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలు, ఈవెంట్స్ తో సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తన పెళ్లిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను త్వరగానే పెళ్లి చేసుకుంటాను, ఒకరి భార్యగా సంసారం, పిల్లలు లాంటి జీవితమంటేనే నాకు ఇష్టమని ఆమె తెలిపారు. 
 

26
Ariayan glory

అరియనా కోరుకున్నట్లు ఆమె పెళ్ళి ముహూర్తం కుదిరింది. నవంబర్ లో ఆమె వివాహం. వరుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మంచి ఇల్లుతో పాటు ఇకపై అరియనా (Ariyana) లైఫ్ ఫుల్ హ్యాపీ అట. విషయంలోకి వెళితే అరియనా ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఉన్నారు. ఆమె ఫైనల్ కి కూడా చేరారు. 
 

36
Ariayan glory


నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss Nonstop) ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. మెజారిటీ ఇంటి సభ్యులు ఎలిమినేట్ కాగా... షో ఫైనల్ కి చేరింది. హౌస్ లో అఖిల్, అరియనా, బిందు మాధవి, శివ, అనిల్ , మిత్ర, బాబా భాస్కర్ ఉన్నారు. వారిలో ఒకరు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ దక్కించుకోనున్నారు. 
 

46


కాగా ఫైనల్ కి చేరిన ఇంటి సభ్యుల భవిష్యత్తు చెప్పడం కోసం శాంతి అనే ఓ జ్యోతిష్యురాలిని లోపలి పంపారు. కంటెస్టెంట్స్ అందరి భవిష్యత్ తో పాటు అరియనా ఫ్యూచర్ కూడా ఆమె చెప్పారు. ప్రత్యేకంగా అరియనా తన పెళ్లి గురించి అడిగింది. దానికి సమాధానంగా శాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

56

నీ పెళ్లి నవంబర్ నెలలో జరుగుతుంది. అబ్బాయి కూడా సిద్ధంగా ఉన్నాడు. అతనితో వివాహంతో నీ జీవితం ఫుల్ హ్యాపీ. మంచి ఇల్లు, జీవితం.. అంతగా బాగుంటాయి అంటూ శాంతి ఆమెకు గుడ్ న్యూస్ చెప్పారు. మరి ఈ న్యూస్ తో అరియనా కూడా సంతోషించారు. మరి ఆమె అభిమానుల ముఖ చిత్రం ఏమిటో చూడాలి.

66

కాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కూడా అరియనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నారు. ఆమె టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్న అఖిల్, శివ, బిందు మాధవితో పోటీపడుతున్నారు. ఈ సారి ఎలాగైనా టైటిల్ దక్కించుకుంటాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఫైనల్ ఉండగా.. ఎవరు ఫస్ట్ ఓటీటీ బిగ్ బాస్ టైటిల్ అందుకుంటారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories