SVP-Mahesh Babu: రిలీజ్ కి ముందు మహేష్ కి కొత్త టెన్షన్... తన అడ్డాలో రికార్డు గల్లంతయ్యాలే ఉందే!

Published : May 11, 2022, 08:40 PM IST

సర్కారు వారి పాట విడుదలకు ముందు మహేష్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. అక్కడ ఓపెనింగ్ వసూళ్ల విషయంలో రికార్డు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి మహేష్ ఈ అవరోధాన్ని ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

PREV
17
SVP-Mahesh Babu: రిలీజ్ కి ముందు మహేష్ కి కొత్త టెన్షన్... తన అడ్డాలో రికార్డు గల్లంతయ్యాలే ఉందే!


సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)చిత్రంపై ఉన్న హైప్ రీత్యా భారీగా ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా నయా రికార్డు నమోదు చేయడం ఖాయం అంటున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ. 7 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ దక్కాయి. నైజాంలో నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డు మహేష్ సాధిస్తాడన్న మాట వినిపిస్తుంది. 

27

అయితే మహేష్ (Mahesh Babu)కి అతి పెద్ద మార్కెట్ గా ఉంది యూఎస్. అక్కడి ప్రేక్షకులు మహేష్ సినిమాలంటే ఎగబడి చూస్తారు. ఏకంగా మహేష్ నటించిన 8 సినిమాలు వన్ మిలియన్ మార్క్ చేరుకున్నాయి. మహేష్ అట్టర్ ప్లాప్ చిత్రాలు కూడా యూఎస్ లో రికార్డు కలెక్షన్స్ సాధించాయి. మిగతా స్టార్ హీరోలకు మహేష్ యూఎస్ రికార్డులు ఆమడ దూరంలో ఉన్నాయి. 
 

37
Image: Getty Images

అయితే ఈసారి ఆయన అక్కడ టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారు. హాలీవుడ్ మూవీ డాక్టర్స్ స్ట్రేంజ్ నుండి ఆయనకు గట్టి పోటీ ఎదురుకానుంది. మార్వెల్ హీరోస్ డాక్టర్స్ స్ట్రేంజ్ ఫ్రాంచైజీ నుండి డాక్టర్స్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్(Doctor Strange in the Multiverse of Madness) యూఎస్ లో విడుదలైంది. మే 6న విడుదలైన ఈ హాలీవుడ్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర ప్రభావం మహేష్ మూవీపై పడనుందనేది  అంచనా. 

47
Sarkaru Vaari Paata Review

డాక్టర్స్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కారణంగా సర్కారు వారి పాట చిత్రానికి థియేటర్స్ సమస్యతో పాటు, కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం కలదు. ముఖ్యంగా సర్కారు వారి పాట ప్రీమియర్ కలెక్షన్స్ ప్రభావితం కావచ్చంటున్నారు. 
 

57
Sarkaru Vaari Paata Review

ఇక మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు రికార్డు స్థాయిలో $ 7.59 లక్షల వసూళ్లు అందుకుంది. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు సర్కారు వారి పాట $ 5.01 లక్షలు రాబట్టింది. హాఫ్ మిలియన్ చెప్పుకోదగ్గ ఫిగర్ అయినప్పటికీ... మహేష్ గత చిత్ర రికార్డుకు కూడా ఇంకా సర్కారు వారి పాట చేరుకోలేదు. సినిమాపై ఉన్న బజ్ రీత్యా వన్ మిలియన్ డాలర్స్ అంచనా వేశారు. 
 

67
Sarkaru Vaari Paata Review


సర్కారు వారి పాట పూర్ యూఎస్ ఓపెనింగ్స్ కి డాక్టర్స్ స్ట్రేంజ్ కూడా ఒక కారణం అనిపిస్తుంది. అయితే ప్రీమియర్స్ కి ఇంకా సమయం ఉండగా అప్పుడే అంచనాకు రావడం కష్టం. అలాగే డాక్టర్స్ స్ట్రేంజ్, సర్కారు వారి పాటకు మధ్య ఎటువంటి పోటీ ఉండకపోవచ్చు. తెలుగు సినిమాకు అక్కడ ప్రేక్షకులు కేవలం తెలుగువారే. కాబట్టి మహేష్ మూవీకి డాక్టర్ స్ట్రేంజ్ ప్రత్యామ్నాయం కాదనే చెప్పాలి. 
 

77


మహేష్ కెరీర్ లోనే సర్కార్ వారి పాట రికార్డు థియేటర్స్ లో విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్స్ లో మే 12న సర్కారు వారి పాట దిగనుంది. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ (Keerthy Suresh)నటించిన సర్కారు వారి పాట మూవీకి థమన్ సంగీతం అందించారు. 

click me!

Recommended Stories