పూజాకు అరుదైన ఛాన్స్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఆహ్వానం.. దీపికా,అక్షయ్ కుమార్ తో హాజరుకానున్న బుట్టబొమ్మ

Published : May 11, 2022, 07:58 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటీనటులు హాజరయ్యే కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈవెంట్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్దేకు ఆహ్వానం అందడం విశేషం.  

PREV
16
పూజాకు అరుదైన ఛాన్స్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఆహ్వానం.. దీపికా,అక్షయ్ కుమార్ తో హాజరుకానున్న బుట్టబొమ్మ

75వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 17 నుండి 28 వరకు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఫ్రాన్స్ లోని  కేన్స్‌ నగరంలో గల ఓ కన్వెన్షన్ సెంటర్ పలైస్ డెస్ లో ఈ ఈవెంట్ బ్రహ్మండగా జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఇండియా నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా పేరొందిన ప్రముఖ నటీనటులు హాజరుకానున్నారు.
 

26

ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకునే, అక్షయ్ కుమార్ మరియు పూజా హెగ్దే ప్రస్తుతానికి ఈవెంట్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్య, దీపికా, కంగనా హాజరయ్యారు. ఈసారి టాలీవుడ్ హీరోయిన్ కు కూడా అవకాశం దక్కడం విశేషం.

36

అయితే ఇలాంటి ఇన్విటేషన్స్ తెలుగు సినిమా హీరోయిన్ కు రావడం పట్ల   ఇండియన్ సినిమా గురించి చెప్పుకోదగ్గ పరిణామమనే చెప్పాలి. పూజా హెగ్డే ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆహ్వానించబడటం గొప్ప విషయం.
 

46

ఇందుకు మే 16న, పూజా ఫ్రాన్స్‌కు వెళ్లనుంది, ఆ తర్వాత మే 17 మరియు 18 తేదీల్లో అక్కడ జరిగే ఉత్సవానికి హాజరవుతుంది. ఇలాంటి ఈవెంట్ లో పూజా హెగ్దేకు స్థానం దక్కడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటీనటులతో కలిసి సమయం గడపబోతున్నందుకు థ్రిల్ ఫీల్ అవుతోంది.
 

56

ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన ఎనిమిది మంది జూరీ సభ్యులతో ఈ ఫెస్టివల్స్ జరగనుంది. జూరీ మెంబర్ లో ఒకరిగా ఈసారి దీపికా పదుకునే హాజరవుతున్నారు. 2017 నుంచి కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతూనే ఉన్నారు. 
 

66

ఈ బ్యూటీకి ఇటీవల ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఎఫ్3 మూవీలో స్పెషల్ అపియరేన్స్ ఇవ్వనుంది.    సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రంలోనూ పూజా నటించనున్నట్టు తెలుస్తోంది. అటు హిందీలోనూ సల్మాన్ ఖాన్‌తో  'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం 'సర్కస్' (హిందీ) మూవీ ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయింది.
 

Read more Photos on
click me!

Recommended Stories