బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. బండ్ల గణేష్.. త్రివిక్రమ్ పై విమర్శలు చేసిన ఆడియో క్లిప్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయినట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం, సినిమాలు రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సినిమా గా పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వచ్చింది. నెక్స్ట్ పవన్ ఓజీ2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.
25
పవన్, త్రివిక్రమ్ స్నేహం
త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని చెప్పడం కరెక్ట్. వీరిద్దరి మధ్య అంత అద్భుతంగా బాడింగ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులకు కొదవ లేదు. సెలెబ్రిటీలే పవన్ అని అమితంగా అభిమానిస్తుంటారు. వారిలో బండ్ల గణేష్ ఒకరు. బండ్ల గణేష్ స్టేజీ ఎక్కితే చాలు.. పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుతూ వీరావేశంతో ఊగిపోతారు.
35
బండ్ల గణేష్ తో విభేదాలు
అనేక సందర్భాల్లో తాను పవన్ కళ్యాణ్ కి భక్తుడు అని బండ్ల గణేష్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఆడియో క్లిప్స్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా బండ్ల గణేష్ అప్పట్లో ట్వీట్స్ కూడా చేశారు.
ఆవేశాలు చల్లారాక త్రివిక్రమ్ తో బండ్ల గణేష్ రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి. అది సహజం. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాం కదా అని ఆ మధ్యన బండ్ల గణేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల బండ్ల గణేష్ తన కుమార్తె వివాహానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో త్రివిక్రమ్ పెళ్ళికి హాజరవుతారా కారా అనే సందేహం ఉండేది.
55
కలసిపోయిన త్రివిక్రమ్, బండ్ల గణేష్
ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ బండ్ల గణేష్ కుమార్తె పెళ్ళికి హాజరయ్యారు. బండ్ల గణేష్ తో చేతిలో చేయి కలిపారు. వధూవరులకు పెద్ద ఫ్లవర్ బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఒక వైపు తన ప్రాణ స్నేహితుడు, మరో వైపు భక్తుడు ఇలా ఇద్దరూ విభేదాలు తొలగించుకుని కలిసిపోవడంతో పవన్ కూడా బాగా సంతోషిస్తారేమో.