OTT Movie: ఓటీటీని ఊపేస్తున్న అప్సర రాణి `డార్క్ సీక్రెట్స్`.. ఇండియా వైడ్‌గా టాప్‌లో ట్రెండింగ్‌

Published : Aug 17, 2026, 06:27 PM IST

ఓటీటీలో మంచి కంటెంట్‌కి ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు అప్సర రాణి నటించిన `డార్క్ సీక్రెట్స్` ప్రైమ్‌లో దుమ్ములేపుతోంది. మొత్తం ట్రెండ్‌ అవుతోంది.

PREV
13
అప్సర రాణి డార్క్ సీక్రెట్స్

ఇప్పుడు థియేటర్ల కంటే ఓటీటీలదే హవా కనిపిస్తోంది. చాలా సినిమాలు థియేటర్లో కంటే ఓటీటీలోనే మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎక్కువ వ్యూస్‌ రాబడుతున్నాయి. దీంతో ఓటీటీలో వచ్చే కంటెంట్‌కి డిమాండ్‌ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు ఆంథాలజీ చిత్రంగా తెరకెక్కిన ‘డార్క్ సీక్రెట్స్’ అమెజాన్‌ ప్రైమ్‌లో దుమ్ములేపుతోంది. ఇందులో అప్సర రాణి నటించడం విశేషం. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలోని `Top 10 Purchases in India` జాబితాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్‌ అవుతుంది. వివిధ భాషల చిత్రాలతో పోటీ పడుతూ దేశవ్యాప్తంగా ఈ స్థాయికి చేరుకోవడం ఈ సినిమా అసలు సక్సెస్‌ గా చెప్పొచ్చు. చిన్న చిత్రాలకు కూడా ఓటీటీ లు ఎంతటి అవకాశాలు కల్పిస్తున్నాయో ‘డార్క్ సీక్రెట్స్’ మరోసారి నిరూపిస్తోంది. సోషల్‌ మీడియాలో దీని గురించి చర్చనడుస్తోన్న నేపథ్యంలో దీనికి మరింత ఆదరణ దక్కుతోంది. ట్రెండ్‌ అవుతోంది.

23
డార్క్ సీక్రెట్స్ కథ ఏంటంటే?

‘డార్క్ సీక్రెట్స్’ మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసే సినిమా. ఇదొక ఆంథాలజీ డ్రామా. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ ఈ సినిమా కథలు తిరుగుతాయి. ప్రతి కథలో ఒక ప్రత్యేక పరిస్థితి, ఒక రహస్యం, ఆ రహస్యం బయటపడినప్పుడు జరిగే పరిణామాలను చూపించే ప్రయత్నం చేశారు. `ప్రతి మనిషి జీవితంలో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం బయటపడితే ఏమవుతుంది?` అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకుని, విభిన్న పాత్రలు, కథల ద్వారా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమా సాగుతుంది. సినిమాలోని కథలు ఒంటరితనం, సామాజిక ఒత్తిడి, నిషేధిత భావోద్వేగాలు, నైతిక హద్దులు వంటి అంశాలను స్పృశిస్తాయి.

33
హ్యూమన్‌ రిలేషన్స్ తో డార్క్ సీక్రెట్స్

‘డార్క్ సీక్రెట్స్’ చిత్రానికి అవినాష్ కొకటి డైరెక్టర్. విభిన్న కథలను ఒకే భావోద్వేగ థీమ్‌తో అనుసంధానిస్తూ, మానవ సంబంధాలు, రహస్యాలు, జీవితంలోని సంక్లిష్ట పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రతి కథకు ప్రత్యేకతను ఇస్తూనే, మొత్తం చిత్రాన్ని ఒకే భావనతో ముందుకు తీసుకెళ్లడం దర్శకుడి ప్రత్యేకతగా నిలిచింది. ఈ చిత్రాన్ని టచ్‌వుడ్ టేల్స్ బ్యానర్‌పై నిర్మించారు. అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో అసలు విశేషం ఏంటంటే బోల్డ్ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించడం. జయశ్రీ, అజిత్‌ రాధారం, మోహిత్‌ రెహ్మానియాక్‌, అరుణ్‌ కుమార్‌ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories