Anasuya into Politics: రాజకీయాల్లోకి అనసూయ.. తెరవెనుక అసలు ప్లాన్‌ ఇదేనా?

Published : Aug 17, 2026, 05:51 PM IST

Anasuya Politics: తరచూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన అనసూయ త్వరలో బిగ్‌ స్టెప్‌ తీసుకోబోతుందా? ఆమె పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతుందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఆమె పొలిటికల్‌ ఎంట్రీకి సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

PREV
16
వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న అనసూయ

యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అది బాధ అయినా, సంతోషం అయినా. అంతేకాదు సమాజానికి సంబంధించిన అంశం అయినా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతుంటుంది. అభ్యంతరకరంగా ఉంటే స్టార్‌ హీరోల సినిమాలను కూడా విమర్శిస్తుంటుంది. విజయ్‌ దేవరకొండ `అర్జున్‌ రెడ్డి` సినిమాపై విమర్శలు చేసింది. ఆ మధ్య మహిళల డ్రెస్‌ గురించి కామెంట్‌ చేసిన శివాజీని ఆడుకుంది. ఇలా చాలా విషయాల్లో ఆమె రియాక్ట్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ ప్రాసెస్‌లో చాలా సార్లు ఆమె ఉద్దేశ్యం రాంగ్‌గా పోట్రే అవుతుంది. జనాలకు తప్పుగా రీచ్‌ అవుతుంటుంది. దీంతో ట్రోల్‌ చేస్తుంటారు. సాధారణంగా అనసూయ ఏం రియాక్ట్ అయినా సరే నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఇలా ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడితే మాత్రం కచ్చితంగా రచ్చ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.

26
సరికొత్త వివాదంలో అనసూయ

లేటెస్ట్ గా అనసూయ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల ఆమె సనాతన ధర్మం, జై శ్రీరామ్‌ అనే నినాదాన్ని అడ్డు పెట్టుకొని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారంటూ కామెంట్‌ చేసింది. దీంతో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆమెని వ్యతిరేకించారు. ట్రోల్‌ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు అనసూయపై హైదరాబాద్‌ బోరబండలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు. సోషల్‌ మీడియాలో మాట్లాడే సమయంలో ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని ఆమెకి వార్నింగ్‌ ఇచ్చారు.

36
నా మాటలను వక్రీకరిస్తున్నారు- అనసూయ

దీనికి అనసూయ స్పందించింది. ఒక నోట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `నా మాటలను కొంత మంది కావాలనే తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, పూర్తిగా డిఫరెంట్‌ వేలో క్రియేట్‌ చేస్తున్నారని, అందుకే ఈ క్లారిఫికేసన్‌ ఇవ్వాల్సి వస్తోందని చెప్పి నోట్‌ ని షేర్‌ చేసింది. `నేను మాట్లాడింది ఒక పర్టిక్యూలర్‌ సెట్‌ ఆఫ్‌ పీపుల్‌ గురించి మాత్రమే. నన్ను గానీ, ఇంకెవరినైనా అబ్యూస్‌ చేసే, వల్గర్ కామెంట్‌ చేస్తూ, పర్సనల్‌ ఎటాక్‌ చేస్తూ బెదిరింపులకు దిగే వాళ్ల గురించి, అది ఏ మతాన్ని, ఏ కమ్యూనిటీని, ఏ నమ్మకాన్ని టార్గెట్‌ చేస్తూ చేసింది కాదు` అని చెప్పింది అనసూయ. ఈ సందర్బంగా తాను సనాతనిగా, హిందువుగా గర్వపడతానని పేర్కొంది. అంతేకాదు తన ధర్మం, తన నమ్మకం, తన విలువల గురించి తనకు ఎలాంటి అపాలజీ అవసరం లేదని, సనాతన ధర్మం తనకు ధైర్యంగా ఉండాలనే విషయాన్ని, సత్యం కోసం నిలబడాలనేది, తప్పుని, తప్పుగా అని చెప్పడం, ఎదుటి మనిషిని గౌరవించడం నేర్పించిందని వెల్లడించింది అనసూయ.

46
హనుమాన్‌ స్ఫూర్తి ముందుకు సాగుతున్నా

`నన్ను నేను హనుమాన్‌ జీ కుమార్తెగా భావిస్తాను, ఆయన భక్తి, ధైర్యం, స్ట్రెన్త్, ఫీయర్‌లెస్‌ నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి, కాబట్టి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుకుండా ఉండటం నా నేచర్‌ కాదు. నేను మాట్లాడిన ఉద్దేశాన్ని మార్చి హిందువుల గురించి, సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడిందని చెప్పడం నిజంగా తప్పు` అని తనదైన స్టయిల్‌లో గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది అనసూయ. అయినా ఈ వివాదం ఆగడం లేదు. బీజేపీ నేతలు రెచ్చిపోతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనసూయకి సంబంధించిన సరికొత్త చర్చ తెరపైకి వస్తుంది. ఆమెకి పెద్దగా సినిమా అవకాశాలు లేవు. పైగా సెలక్టీవ్‌గా చేస్తుంది. ఈక్రమంలో ఆమె దృష్టి ఇప్పుడు రాజకీయాలపై పడిందనే వాదన తెరపైకి వస్తోంది. అనసూయ రాజకీయాల్లోకి వెళ్లే లక్ష్యంతోనే ఇలాంటి కామెంట్లు చేస్తుందనే చర్చ నడుస్తోంది.

56
అనసూయ పొలిటికల్‌ ఎంట్రీ ప్లాన్‌

చాలా మంది సోషల్‌ మీడియాలో హడావుడి చేసి, వివాదాలు సృష్టించి పాపులారిటీ పొందుతున్నారు. తమ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వారిని ఆకర్షిస్తున్నాయి. తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే అనసూయ ప్లాన్‌ కూడా అదే మాదిరిగా ఉందనే టాక్‌ నడుస్తోంది. నటిగా లాంగ్‌ రన్‌ కష్టంగా మారుతున్న నేపథ్యంలో రాజకీయాలు బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నటు సమాచారం. అయితే అనసూయ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రాజకీయ పార్టీలు కూడా ఆమెని ఆహ్వానించేందుకు రెడీగా ఉంటాయి. ఆ ఉద్దేశంతో అనసూయ ముందస్తు బ్యాక్‌ గ్రౌండ్‌ని రెడీ చేసుకుంటుందని టాక్‌.

66
అనసూయ రాజకీయాల్లోకి వస్తే రచ్చే

రాజకీయాల్లో రాణించాలంటే బోల్డ్ గా ఉండాలి, డేర్‌గా ఉండాలి. విమర్శ చేసేటప్పుడు ప్రతి విమర్శలు కూడా తీసుకోవాలి. ఈ విషయంలో తాను స్ట్రాంగ్‌ అని అనసూయ ప్రకటించుకుంది. ధైర్యవంతురాలిని అని, హనుమాన్‌ స్ఫూర్తితో ముందుకు సాగుతానని తెలిపింది. ఇవన్నీ పొలిటికల్‌ ఎంట్రీకి సంబంధించిన హింట్స్ అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఏదేమైనా అనసూయ రాజకీయాల్లోకి వస్తే రచ్చ వేరే లెవల్‌ లో ఉంటుందని, యమ రంజుగా మారతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమె రాజకీయం ఇంట్రెస్టింగ్‌ ఎపిసోడ్‌గా మారబోతుందని చెప్పొచ్చు. మరి అనసూయ అసలు ప్లానేంటో తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories