40 ఏళ్ళకు అడుగు దూరంలో ఉంది హీరోయిన్ త్రిష. హీరోయిన్ గా ఫెయిడ్ అవుడ్ అయ్యింది.. ఇక విమెన్ సెంట్రిక్ మూవీస్ కే పరిమితం అనుకున్న టైమ్ లో.. అందరికి షాక్ ఇస్తూ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందట చెన్నై చిన్నది. స్టార్ హీరో జతగా నటించబోతుందట.
టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోయిన్ గా చక్రం తిప్పింద త్రిష. దాదాపు10 ఏళ్లకు పైనే ఈ రెండు బాషలను హీరోయిన్ గా ఏలింది. రాను రాను కుర్ర హీరోయిన్ల హవా పెరగడంతో సైలెంట్ అయిపోయింది. సీనియర్ హీరోల సినిమాల్లో... అడపా దడపా నటించడం, విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ వస్తోంది బ్యూటీ.
27
Ponniyin Selvan- Trisha wear original jewelry to do justice to the role
సరిగ్గా అదే టైమ్ లో తమిళ జీనియస్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో అద్భుతమైన పాత్ర దొరికింది త్రిషకు. ఈ సినిమా తమిళనాట ఒక ఊపు ఊపి వదిలిపెట్టింద. దేశవ్యాప్తంగా కూడా ఇంట్రెస్ట్ ను క్రీయేట్ చేసింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దాంతో త్రిషకు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు తెలుస్తోంది.
37
పొన్నియన్ సెల్వన్ ఎఫెక్ట్ తో మంచి మంచి సినిమాల త్రిష ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నాయట. హీరోయిన్ గా కూడా అవకాశాలు సాధిస్తోందట త్రిష. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆమె ఏకంగా తమిళ దళపతి విజయ్ సినిమాలోనే హీరోయిన్ గా ఆఫర్ అందుకున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
47
trisha - vijay
త్రిష మంచి మంచి అవకాశాలను మళ్లీ తన ఖాతాలో వేసుకుంటుంది . రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న విజయ్ 67వ సినిమాలో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై తమిళ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
57
ఇప్పటికీ అదే గ్లామర్ తో.. త్రిష అలానే ఉంది. గతంలో విజయ్-త్రిషల కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది.ఈ ఇద్దరి సినిమాలకు తిరుగులేని విజయాన్ని సాధించాయి. అయితే విజయ్ అభిమానుల్లో మరో డౌట్ కూడా ఉంది.
67
ఇప్పటికీ అదే గ్లామర్ తో.. త్రిష అలానే ఉంది. గతంలో విజయ్-త్రిషల కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది.ఈ ఇద్దరి సినిమాలకు తిరుగులేని విజయాన్ని సాధించాయి. అయితే విజయ్ అభిమానుల్లో మరో డౌట్ కూడా ఉంది.
77
హీరోయిన్ గాఫెయిడ్ అవుట్ అయిన త్రిష, విజయ్ సరసన హీరోయిన్ గానా...? ఇది నిజమేనా..? లేక ఇంకేదైనా పాత్ర కోసం త్రిషను తీసుకుంటున్నారా..? అని అడుగుతున్నారు ఫ్యాన్స్. మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ చూడాల్సిందే.