హౌస్ నుంచి సూర్య అవుట్, వెక్కి వెక్కి ఏడ్చిన ఇనయా, సీక్రేట్ రూమ్ కు పులిహోర రాజా...?

First Published | Oct 29, 2022, 11:48 PM IST

ఈ వీకెండ్ బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. హోరా హోరీ పోరులో అంతా తమ సత్తా చాటారు. ఇక అందరికి ట్విస్ట్ ఇస్తూ.. ఈసారి శనివారమే ఎలిమినేషన్ పెట్టారు బిగ్ బాస్. అందరికి షాక్ ఇచ్చాడు. 

ఈ వారం బిగ్ బాస్ హౌస్ మామూలుగా లేదు. కంటెస్టెంట్స్ అంతా రచ్చ రచ్చ చేశారు. ఇక కంటెస్టెంట్స్ తో పాటు  వీకెండ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు నాగార్జున. ఈసారి హౌస్ అంతా ఎలిమినేషన్ లో ఉండగా.. సేవ్ చేయడం లాంటివి ఏమీ లేవు డైరెక్ట్ ఎలిమినేషనే అని తేల్చేశారు. 

ఇక ఎవరూ ఊహించని విధంగా ఆర్ జే సూర్య ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే సూర్య ఎలిమినేట్ అయ్యాడా లేక సీక్రేట్ రూమ్ లో ఉంచుతారా అనేది మాత్రం ఇంకా తెలియడంలేదు. రేపు ఎపిసోడ్ లో కలుద్దాం అంటూ నాగ్ వెళ్ళిపోయారు. చాలా వరకూ సూర్యను సీక్రేట్ రూమ్ లోనే ఉంచే అవకాశం కనిపిస్తోంది. సూర్య వెళ్ళిపోవడంతో అటు కీర్తి.. ఇటు ఇనయా బోరుమన్నారు. ఇనయా అయితే గేటు ముందు పడిపోయి మరీ ఏడ్చేసింది. 
 


ఒక వేళ సూర్య హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా.. పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకుంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సూర్య ఫస్ట్ ఆరోహీతో.. తరువాత ఇనయాతో ఏం చేస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నాడు. ఇప్పటికే పులిహోర రాజా అనే పేరు కూడా అతనికి పడిపోయింది. ఇదే అతనికి మైనస్ అయ్యి.. ఓట్లు పడలేదేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 
 

ఇంతకీ అసలు ఏం జరిగింది.. అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తోంది. ఇక ఈవీకెండ్ సండచి చేయడానికి వచ్చిన నాగార్జున ..వచ్చి రావడంతోనే టాస్క్ గురించి అందరిపై ఫైర్ అయ్యాడు. హౌస్ లో జరిగిన రచ్చ వల్ల ఆడియన్స్ అనుకున్నట్టుగానే అందరిమీద ఫైర్ అయ్యాడు కింగ్ నాగార్జున . ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేశాడు. ముఖ్యంగా గీతు, రేవంత్, సూర్య, .. ఇలా అంతా నాగ్ చేతుల్లో అక్షంతలు వేయించుకున్నారు. 

నాగార్జునకు సమాధానం చెప్పుకోలేక ఫైర్ బ్రాండ్ గీతు కూడా బిక్కముఖం వేసింది. ఇక హౌస్ అందరి అభిప్రాయాలు తీసుకుని మరీ సంచాలక్ గా గీతూ ఫెయిల్ అయినట్టు తేల్చేశాడు కింగ్.  ఈసారి నువ్వు పనిష్మెంట్ ఫేస్ చేయకు తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక రేవంత్ ను కూడా ఇదే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన నాగ్. రేవంత్ టాస్క్ లో భాగంగా లేడీస్ ను నెట్టేయడం గురించి మాట్లాడుతూ.. అది ఏదో ఆటలో తెలియ నెట్టినట్టు లేదు. కావాలని నెట్టినట్టు ఉంది. ఒక ఉన్మాదిలా ఆడావంటూ.. రేవంత్ పై రెచ్చిపోయాడు కింగ్. 
 

ఇక మిగతా వాళ్లకు కూడా ఇదే రేంజ్ లో పడింది. ఒక ఫెమినిస్ట్ ను అన్నావ్ సూర్య ఇదేనా నీ ఆట అంటూ.. వాసంతీకి అన్యాయం చేసిన విషయంలో గట్టిగానే క్లాస్ పీకాడు. ఇక హౌస్ లో ఎప్పటికప్పుడు కామెడీతో నవ్విస్తున్న ఫైమాకు..ఒక్కోసారి కామెడీ ఎక్కువైతే ప్రమాదం.. అతి చేయవద్దు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ప్రతీ ఒక్కరికి చెమటలు పట్టేలా..సెట్ రైట్ అయ్యేలా ఇచ్చిపడేశాడు నాగార్జున. 

ఇక రేపటి ఎపిసోడ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు సూర్యను బయటకు పంపిస్తారా..? లేక ఇంకేదైనా మిరాకిల్ జరుగుతందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి. 
 

Latest Videos

click me!