స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన త్రిష, కారణం ఏంటో తెలుసా..?

First Published | Sep 14, 2024, 5:57 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇంట్లో ఓ స్టార్ హీరో ఉంటున్నాడని మీకు తెలుసా..? ఆహె ఇంట్లో ఆ సీనియర్ హీరో ఉండటానికి గల కారణం ఏంటో తెలుస్తే నిజంగా షాక్ అవుతారు. 

త్రిష దాదాపు 20 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా కొనసాగుతూ.. స్టార్డమ్ తో దూసుకుపోతోంది. అంతే కాదు హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మొదటి తారగా త్రిష రికార్డ్ సాధించింది. హీరోయిన్ గా ఒక్క సారి ఫెయిడ్ అవుట్ అయితే ఇక ఛాన్స్ లు కష్టమే. కాని త్రిష కెరీర్ లో మాత్రం అద్భుతం జరిగింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గి.. ఇక కనుమరుగవుతుంది అనుకున్న హీరోయిన్.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి తన కెరీర్ ను ఫ్రెష్ గా స్టార్ట్ చేసింది. ఆ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు సాధిస్తోంది బ్యూటీ. తమిళంతో పాటు.. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక సుధీర్గ కాలం నుంచి తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నఈ చెన్నై సోయ‌గం.. ప్రస్తుతం చిరంజీవి సరసన విశంభర సినిమాలో నటిస్తోంది. అటు తమిళంలో అజిత్ సినిమాలో కూడా చేస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉంది ఈ బ్యూటీ.

పెద్ద వయసు హీరోలను పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు


నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ చేతి నిండా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. సౌత్ లో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్ర‌స్ గా స‌త్తా చాటుతోంది. అటువంటి త్రిష త‌న ఇంటిని ఒక సీనియ‌ర్ స్టార్ హీరోకు అమ్మేసింద‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు  సీనియర్ హీరో భాను చందర్. 

బిగ్ బాస్ లో ఈ రూల్ మారిపోయింది గమనించారా..?

ప్ర‌స్తుతం హీరోయిన్  త్రిష ఇంట్లో భాను చంద‌ర్ ఉంటున్నాడట‌. అసలు త్రిష భానుచందర్ కు ఇల్లు ఎందుకు అమ్మేసిందో తెలుసా..? కారణం ఏదై ఉండొచ్చు. అసలు ఆమెకు ఈ అవసరం ఎందుకు వచ్చిందనుకుంటున్నారు.  అయితే త్రిష భానుచందర్ కు ఇల్లు అమ్మింది ఇప్పుడు కాదు.. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో.  అవును త్రిష తండ్రి భాను చందర్ కు  ఈ ఇల్లు అమ్మారు. 

తెలుగు హీరో అయిన భాను చందర్ చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీ  హైదరాబాదుకు షిఫ్ట్ అయినా కూడా కొందరు అక్కడ ఆస్తకులు కొనుకుని సెటిల్ అయిన వారు.. హైదరాబాద్ రాలేకపోయారు. అలా చాలామంది నటీనటులు చెన్నైలోనే ఉండిపోయారు. శుభలేక సుధాకర్, భాను చందర్, ఎస్పీబీ, డబ్బింగ్ జానకీ, గొల్లపూడి, ఇలా చాలామంది చెన్నైలోనే ఉంటున్నారు. 

మహేష్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్

ఇక  ప్ర‌స్తుతం చెన్నైలో భాను చందర్ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. తన ఇల్లు చూపిస్తూ.. తాను ఉంటున్న ఈ ఇల్లు.. స్టార్ హీరోయిన్ త్రిషది అని అన్నారు. త్రిష కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి వ్యాపారానికి డబ్బులు తక్కువ అవ్వడంతో ఈ ఇల్లు భాను చందర్కు అమ్మేశారట. 

ఆ త‌ర్వాత త్రిష ఇంటిని భాను చందర్ భార్య తమ టేస్ట్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని  అందంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. అందుకోసం వారు చాలా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. భాను చందర్ కు చెట్టు అంటే చాలా ఇష్టం. ఆయన సతీమనికి పూలు అంటే చాలా ఇష్టం.. అందకే ఇల్లంతా పూలమొక్కలతో పచ్చగా తయారు చేశారు. 

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ఇక ఎప్పుడన్నా త్రిష కనిపిస్తే.. మా ఇల్లు ఎలా ఉంది? అని అడుగుతుందని ఇంట‌ర్వ్యూలో భాను చంద‌ర్ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో త్రిష బెడ్రూం, ఇప్పుడు తన బెడ్రూం అయిందని తెలిపారు. త్రిష ఇల్లు త‌మ‌కు బాగా క‌లిసొచ్చింద‌ని కూడా ఆయ‌న అన్నారు. కాగా, భాను చంద‌ర్ కు త్రిష అమ్మేసిన ఇంటి విలువ ప్ర‌స్తుతం రూ. 8 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం.

1 కోటి 20 లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్, ఇన్ స్ట్రాగ్రామ్ లో ఎవరిని పాలో అవుతాడో తెలుసా..?

Latest Videos

click me!