హీరో మీద కోపంతో షూటింగ్ నుంచి వచ్చేసిన త్రిష, కారణం ఏంటో తెలుసా..?

First Published | Oct 24, 2024, 5:51 PM IST

స్పెయిన్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్ జరుగుతుండగా, అక్కడి నుండి హఠాత్తుగా నటి త్రిషా చెన్నైకి వచ్చేశారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ త్రిషా

చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లకు పైగా  స్టార్ హీరోయిన్ గా  వెలుగొందుతుంది త్రిష. ఆమెకు ప్రస్తుతం 41 ఏళ్లు. అయినప్పటికీ పెళ్లి చేసుకోకుండా  సింగిల్‌గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.  త్రిష  సినిమాలపై తన  పూర్తి దృష్టిని పెట్టారు.

సాధారణంగా హీరోయిన్లు 40 ఏళ్లు దాటితే వారికి హీరోయిన్‌గా నటించే అవకాశం తగ్గిపోతుంది. కానీ త్రిషా 41 ఏళ్ళ వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తున్నారు కాబట్టి ఆమెకు సినిమా అవకాశాలు వరుస కడుతున్నాయి.

Also Read: ప్రభాస్ - సమంత కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కారణం

నటి త్రిషా నటించిన విడాముయర్చి, థగ్ లైఫ్, విశ్వంభర, ఎవిడెన్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో విడాముయర్చి, థగ్ లైఫ్, విశ్వంభర, ఎవిడెన్స్ వంటి చిత్రాలలో షూటింగ్ కంప్లీట్ చేసింది త్రిష.

ప్రస్తుతం ఆమె గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోస్టార్ హీరో  అజిత్‌కు జంటగా నటిస్తున్నారు త్రిష. ఈసినిమా  షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది.


అజిత్ త్రిషా

అక్కడ అజిత్, త్రిషా నటించిన సన్నివేశాలు చిత్రీకరించబడుతుండగా, ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ నుండి హఠాత్తుగా చెన్నైకి వచ్చేశారు త్రిషా. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర బృందంతో జరిగిన గొడవ కారణంగా ఆమె చెన్నైకి తిరిగి వచ్చారా లేదా అజిత్‌తో ఏదైనా గొడవా అని అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆమె హఠాత్తుగా చెన్నైకి రావడానికి అసలు కారణం వేరే అని చెబుతున్నారు.

త్రిషా

త్రిషా సినిమాలే కాకుండా ప్రకటనలలో కూడా నటించి కోట్లకు పడగలెత్తుతున్నారు. ఆ కోవలోనే ఒక నగల దుకాణం ప్రకటనలో నటించడానికే నటి త్రిషా చెన్నైకి వచ్చారు. ఆ ప్రకటన షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ స్పెయిన్‌కి వెళ్లి గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని చెబుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

Latest Videos

click me!