300 కోట్ల ఆస్తులు, ప్రైవేట్ జెట్, 4 ఇళ్లు, లగ్జరీ కార్లు.. సౌత్ హీరోయిన్లలో రిచ్ బ్యూటీ ఎవరో తెలుసా..?

First Published | Feb 27, 2024, 2:48 PM IST

వందల కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు, ఇళ్లు,  ప్యాపారాలు.. సౌత్ ఇండియాన్ హీరోయిన్లలో ఇవన్నీ కలిగిని రిచెస్ట్ బ్యూటీ ఎవరో తెలుసా..? ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది కదా..? 
 

లెజెండరీ స్టార్ బ్యూటీ.. దివంగత నటి శ్రీదేవి నుండి ప్రస్తుతం స్టార్ హీరయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన వరకు, చాలా మంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు వారి వారి టైమ్ లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ కొంత మంది స్టార్ డమ్ తో దూసకుపోతున్నారు. అనేక బ్లాక్‌ బస్టర్  సినిమాలను అందించిన  హీరోయిన్లు  పాన్-ఇండియన్ సినిమా యుగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. యాక్టింగ్ టాలెంట్ తో పాటు నటీనటులకు ఆస్తులు కూడా గట్టిగా కూడబెట్టుకుంటున్నారు. 

ఇక ఇప్పటి వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలయిన్లు గా కొనసాగిన తారల్లో అత్యధికంగా ఆస్తులు కుడబెట్టిన వారు ఎవరు..? ఈ ఏడాది అంటే  2024లో అత్యంత ధనిక  హీరోయిన్ ఎవరు..? ఆహీరోనయిన్ ఆస్తులు ఎన్నికోట్లు...ప్రాపర్టీస్ వాల్యూతోపాటు.. ఆమె సంపాదన..వ్యాపారాలు గురించి చూద్దాం. 
 


సౌత్ ఇండియాలో అత్యంత ధనిక నటి మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. 20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ సీనియర్ బ్యూటీ. తమిళ సినిమాతో  తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, మలయాళ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా జవాన్ సినిమాతో  బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో నయనతార ఒకరు.

ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, నంది అవార్డు వంటి పలు అవార్డులను సొంతం చేసుకున్న నయనతార రీసెంట్ గా జవాన్‌ సినిమాతో తన నటనకు ఉత్తమ నటిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకుంది. నయనతార తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ నాగ్ లాంటి హీరోలతో జతకట్టింది. తమిళంలో రజినీ, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్, లాంటి స్టార్ల తో సినిమాలు చేసింది. 
 

అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవించిన నయనతార గట్టిగా సంపాదించింది కూడా. దేశంలోని అత్యంత ధనిక నటీమణులలో నయనతార  ఒకరు. ముఖ్యంగా సౌత్ హీరోయిన్లలో ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న హీరోయిన్ గా నయనతార ముందున్నారు. ఆమె  మొత్తం ఆస్తి విలువ దాదాపు 300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. 

అంతే కాదు ఆమెకు  చెన్నైతో పాటు, హైదరాబాద్, కేరళ, ముంబై వంటి నగరాల్లో  నగరాల్లో నయనతార 4 విలాసవంతమైన ఇళ్ళు మరియు 100 కోట్ల విలువైన 4 BHK ఇల్లు కూడా కలిగి ఉంది. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల పైనే డిమాండ్ చేస్తుందట.  దీంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి అనే గౌరవం కూడా ఆమె సొంతం చేసుకుంది. 

నయనతార సినిమాలు మాత్రమే కాదు .. కమర్షియల్ యాడ్స్ కూడా అధికంగా చేస్తుంది. చికెన్ యాడ్ తో పాటు  కె బ్యూటీ మరియు తనిష్క్‌తో సహా అనేక ప్రముఖ భారతీయ బ్రాండ్‌లకు కూడా ప్రమోట్ చేస్తోంది. వాటి కోసం  5 కోట్ల వరకూ వసూలు చేస్తుందట బ్యూటీ. ఇక ఇంతలా సంపాదన ఉంటే.. విలాసవంతమైన జీవితం ఉంటుంది కదా..? అందులో భాగంగానే  నయనతారకు ఓ ప్రైవేట్ జెట్  కూడా ఉంది.

nayanthara

నయనతార గ్యారేజ్ లో భారీ స్థాయిల్ లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె గ్యారేజ్ లో  BMW 5 సిరీస్, Mercedes GLS 350T, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫోర్డ్ ఎండీవర్ మరియు BMW 7-సిరీస్ వంటి లగ్జరీ కార్లు కలిగి ఉంది నమనతార.  
 

Nayanthara Femi9

నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ నడుపుతోంది. నిర్మాణ సంస్థ విలువ 50 కోట్లుగా చెబుతున్నారు. అలాగే నటి నయనతార సాయి వాలే అనే ప్రముఖ కంపెనీలో 5 కోట్లు పెట్టుబడి పెట్టారట. దీంతో ఆమెకు  ఇప్పటికీ  ఆదాయం వస్తోందని టాక్. . గత సంవత్సరం 2019లో, నయనతార డాక్టర్ రెనిటా రాజన్‌తో కలిసి లిప్ బామ్ కంపెనీని ప్రారంభించింది.

ఆమె కంపెనీ 100కి పైగా వివిధ రకాల లిప్ బామ్‌లను కలిగి ఉన్న మొదటి ప్రధాన బ్రాండ్ అని చెప్పబడింది. యూఏఈలో చమురు వ్యాపారంలో ఆమె దాదాపు 100 కోట్ల పెట్టుబడి పెట్టరని.. అంది ఆమె సోదరుడు చూసుకుంటారని టాక్. అంతే కాదు సోషల్ మీడియా టాక్ ప్రకారం తన స్నేహితుడితో కలిసి స్కిన్ కేర్ కంపెనీ కూడా నడుపుతున్నారు. 

ఇటీవల మలేషియాలో 9 చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రారంభించింది. మహిళల కోసం శానిటరీ నాప్‌కిన్ బ్రాండ్ అయిన ఫెమీ 9ని కూడా ఆయన ప్రారంభించారు, దీనికి మంచి ఆదరణ లభించింది. నటి నయనతార సినిమాల్లోనే కాకుండా వ్యాపారంలో కూడా బిజీగా ఉంది. 

Latest Videos

click me!