త్రిష 2002 తమిళ చిత్రం `మౌనం పెసియదే`తో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. రెండేళ్ల తర్వాత `వర్షం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు` వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించి, హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ఆ తర్వాత `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్`, `సైనికుడు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `కృష్ణ`, `బుజ్జిగాడు`, `శంఖం`, `నమో వెంకటేశా`, `తీన్ మార్`, `బాడీ గార్డ్`, `దమ్ము`, `లయన్`, `చీకటి రాజ్యం` వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటించింది. ఇది రిలీజ్ కావాల్సింది. మరోవైపు ఆమె తమిళంలో నటించిన `కరుప్పు`(వీరభద్రుడు) చిత్రం ఈ శుక్రవారం(మే 15)న విడుదల కానుంది.