చెన్నైలో హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు రూ.10 కోట్ల విలువైన ఓ అదిరిపోయే ఇల్లు ఉంది. లగ్జరీ ఇంటీరియర్స్, వాక్-ఇన్ క్లోసెట్ వంటి హంగులతో ఎంతో స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. మరి ఆ ఇంటిని మీరెప్పుడైనా చూశారా?
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు చెన్నైలోని ప్రైమ్ లొకేషన్‌లో రూ.10 కోట్ల విలువైన ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. పాతకాలపు హంగులు, ఆధునికత కలగలిపి ఈ ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది. మరి త్రిష ఇంటి ప్రత్యేకతలేంటో తెలుసా?
25
కుక్కలంటే ఎంతో ఇష్టం..
త్రిషకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంట్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎంబ్రాయిడరీ రగ్గులు, క్లాసీ వుడెన్ ఫ్లోరింగ్‌తో తన పెంపుడు జంతువులకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంది.
35
త్రిషకు ఇష్టమైన రంగులతో..
త్రిషకు రంగులంటే చాలా ఇష్టం. ఆమె ఇల్లే దీనికి నిదర్శనం. ఇంటి ఇంటీరియర్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చేలా పెద్ద ఆరెంజ్ కలర్ సోఫాను, దానికి మ్యాచింగ్ పిల్లోస్‌ను ఏర్పాటు చేసింది.
త్రిష ఇంట్లో ఎన్నో కళాత్మకమైన వస్తువులు ఉన్నాయి. గ్లాస్ సాష్‌లు, వుడెన్ ప్యానెల్స్, క్లాసీ రగ్గులు, అందమైన ఫ్లవర్ అరేంజ్‌మెంట్స్‌తో ఇంటిని అలంకరించింది.తన పెంపుడు కుక్క హాయిగా సేద తీరడం కోసం ఫంకీ పర్పుల్ కలర్ సోఫాను కూడా ఇంట్లో ఏర్పాటు చేసింది త్రిష.
55
శాలంగా ఉండే పెద్ద ఇల్లు..
త్రిష ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. తరచుగా తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను టెర్రస్‌పైనే జరుపుతుంది. ఆ సమయంలో టెర్రస్‌ను అందంగా లైట్లతో అలంకరిస్తుంది.ఆమె ఇంట్లో పాతకాలపు వుడెన్ ఫర్నిచర్, ఆధునిక హంగుల కలయిక అద్భుతంగా ఉంటుంది. త్రిష ఈ ఇంట్లో ఒక్కరే ఉంటారు. ఆమె ఫ్యామిలీ మరో ఇంట్లో ఉంటారని సమాచారం.