Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య

Published : Mar 18, 2026, 10:25 AM IST

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేస్తాడు రాజు. ఇందును నోటికొచ్చినట్లు మాట్లాడి అవమానించింది ఐశ్వర్య. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

PREV
17
ల్యాప్‍టాప్‍లో జాబ్‍కు అప్లై చేసిన ఇందు

ఇందు, స్వాతి నవ్వుకుంటూ ఉంటారు. చాలా బాగా యాక్ట్ చేశావని మెచ్చుకుంటుంది. ఎక్కడ దొరికిపోతామేమో అని భయం వేసిందని ఇందు అంటుంది. నువ్వు ఆడిన నాటకానికి మీ అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుందని అంటుంది. నాకు కూడా భయం వేసిందక్క, సరే గానీ నీ జాబ్ సంగతి ఏమైందని స్వాతి అడుగుతుంది. సెలెక్ట్ అయ్యే సమయానికి ఓ వెదవ వచ్చి నాశనం చేశాడని చెప్తుంది. ఓ రోజు ఏగ్జామ్‍కు వెళ్తుంటే కారుకు డాష్ ఇచ్చి డబ్బులు అడిగాడు కదా వాడి వల్లే జాబ్ పోయిందని చెప్తుంది. మరెప్పుడు జాబ్ ఎలా అప్లై చేస్తావ్ అని స్వాతి అంటుంది. దానికి నువ్వే హెల్ప్ చేయ్ అని అడుగుతుంది ఇందు. నేను ఎలా చేస్తా అక్కా అంటే...నీ ల్యాప్‍టాప్‍లో నుంచి ఉద్యోగానికి అప్లై చేద్దాం, వాళ్లే ఇంటర్వ్యూకు పిలుస్తారని ఇందు అంటుంది. స్వాతి ల్యాప్‍టాప్ తెచ్చి జాబ్‍కు అప్లై చేస్తుంది.

27
బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు

మరోవైపు పడుకున్న రాజును...వాళ్ల నాన్న వచ్చి తిడతాడు. బైక్ ఏం చేశావని నిలదీస్తాడు. ఆ విషయం నన్ను అడగకు...మీ చిన్న కొడుకును అడుగు అని ప్లేట్ మార్చేస్తాడు. నీ బైక్ కోసం వాడికెలా తెలుస్తుందని వాళ్ల నాన్న అంటే...వాడి ఫ్రెండ్‍కు అవసరమైతే ఇప్పించాడని చెప్తాడు. వెంకీని తండ్రి అడుగుతాడు...నువ్వు నిజంగా ఇచ్చావా అంటే, ఇటు రాజు పబ్‍లో డ్రింక్ పట్టుకున్న ఫోటో చూపిస్తూ తమ్ముడిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. నీ ఫ్రెండ్స్ లో అందరికీ కార్లు ఉన్నాయ్ కదా అంటాడు వాళ్ల నాన్న. జరిగింది చెప్పేసేయ్...నాన్నేగా అడిగేది అంటాడు రాజు. ఏం జరిగింది అన్నయ్యా అంటే...సరే నా నోటితో చెప్తాలే అంటాడు రాజు. మీ చిన్న కొడుకు గురించి తెలుసుకదా, ఎవరైనా సాయం చేయమని అడిగితే వాడి ఫ్రెండ్‍కు బైక్ ఇచ్చాడు, వాడు తాగేసి పోలీసులకు దొరికిపోయాడని రాజు అంటాడు. ఇంతలో లక్కీ వస్తాడు. నేను అప్పటికీ చెప్తునే ఉన్నా..ఎదిగిన తండ్రిని ఎందుకురా ఇబ్బంది పెడతావ్ అని అంటాడు. నేను ఎదగడం ఏంట్రా..నేను ఎదిగి 50 ఏళ్లు అయింది. ఫస్ట్ ఎదగండని అని రాజు వాళ్ల నాన్న గడ్డి పెడతాడు. బైక్ విడిపించడానికి రూ.1000 తమ్ముడి దగ్గర నొక్కేస్తాడు.

37
డీల్ కోసం బయటకు వెళ్లిన లక్కీ, రాజు

మొత్తానికి రూ.వెయ్యి నొక్కేశావ్ అని లక్కీ అంటే...నువ్వు చేసిన వెదవపనికి వాడికి ఫైన్ ఇచ్చానని రాజు అంటాడు. సరేగానీ త్వరగా రెడీ అవ్వు, బయటకు వెళ్లాలని లక్కీ అంటాడు. ఎక్కడికి అని అడిగితే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాలి, ఏదో మంచి డీల్ ఉందంట అని చెప్తాడు లక్కీ, ముందు కోర్టులో ఫైన్ కట్టి బైక్ తెచ్చుకోవాలని రాజు అంటే...పోలీసులను నువ్వు ఎలానో మేనేజ్ చేస్తావ గానీ ముందు డీల్ చూద్దాం పద అంటాడు. 

47
ఫోన్ మోగడంతో కంగారు పడిన ఇందు

అటు ఇంట్లో ఇందు కిచెన్‍లో ఉండగా ఫోన్ మోగుతుంది. ఇందు కంగారుపడి వెతుకుతుంది. ఇంతలో శేషం వస్తాడు. నీకేమైనా ఫోన్ సౌండ్ వచ్చిందా అడుగుతాడు. వస్తే గిస్తే మీ దగ్గర రావాలి గానీ నా దగ్గర ఫోన్ లేదు ఎలా వినిపిస్తుంది అంటుంది ఇందు. మరోసారి ఫోన్ మోగితే...శేషం అడుగుతాడు. నీ ఫోన్‍లోనే బాబాయ్ రింగ్ అవుతుందని ఇందు చెప్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ శేషం వెళ్లిపోతాడు. ఆకుకూరలు కింద ఫోన్ చూసి...ఫోన్ చేసిన వారికి ఇందు ఫోన్ చేస్తుంది. ఎవరు అని అడిగితే ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారని చెప్తారు. ఫోన్ కట్ చేస్తుండగా వెనుకనుంచి అపర్ణ వచ్చి భుజంపై చేయి వేస్తే ఇందు కంగారు పడుతుంది. ఎవరో అనుకుంటుంది. వెనక్కి తిరిగి చూసే సరికి అపర్ణ ఉంటుంది. నీకో దండమే తల్లి పిలుచుకుంటూ వస్తే ఏమౌతుంది. సడెన్‍గా వచ్చి భుజంపై చేయి వేసేసరికి భయమేసిందని ఇందు అంటుంది. ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యా అని చెప్తుంది. మళ్లీ ఇంటర్వ్యూనా అని అపర్ణ అంటే...ఈసారి పబ్‍లో కాదు, ఆఫీస్‍కు రమ్మన్నారని చెప్తుంది. ఏంటోనే నీ జీవితం నిమిషానికో గండం, క్షణానికో నరకం అనేలా తయారైందని అంటుంది. అయ్యో నాన్నమ్మ శుభమా అని ఇంటర్వ్యూకు వెళ్తుంటే సెంటిమెంట్‍ డైలాగులు ఏంటీ, సెలెక్ట్ అవ్వాలని ఆశీర్వదించు అంటుంది. సరే గానీ తాతయ్యకు టాబ్లెట్ ఇచ్చావా అని ఇందు అడిగితే...ఇవ్వలేదే అని అపర్ణ అంటుంది. టైంకు టాబ్లెట్ ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పాను, ఇంట్లో పెద్దవాళ్లు మీరో నేనో అర్థం కావడం లేదంటూ సరే నేనే టాబ్లెట్ ఇస్తా అని ఇందు అంటుంది.

57
స్వాతిని ఐశ్వర్య కొట్టబోతుంటే అడ్డుకున్న ఇందు

ఇక్కడ ఐశ్వర్య పార్టీకి వెళ్లడానికి ఫ్రెండ్స్ తో ఫోన్‍లో మాట్లాడుతుంది. ఇంతలో స్వాతి వచ్చి తిడుతుంది. నిన్న చేసింది చాల్లేదా మళ్లీ పార్టీకి వెళ్తావా అనినిలదీస్తుంది. పొద్దుపొద్దున్న నీ సోది ఏంటని ఐశ్వర్య చికాకు పడుతుంది. నిన్న తాగేసి ఎవడో బైక్ ఎక్కి వెళ్తుంటే పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు, కనీసం గుర్తులేదా అని అడుగుతుంది స్వాతి. నువ్వు చిన్నపిల్లవి, చిన్న పిల్లలా ఉండు అని ఐశ్వర్య అంటుంది. నువ్వు పెద్దదానిలా ఉన్నావా అని, పోలీసులు రాకపోయుంటే వాడి బైక్ ఎక్కి పోయేదానివని స్వాతి అంటుంది. స్వాతిపై చేయి చేసుకోవడానికి ఐశ్వర్య ప్రయత్నిస్తే...ఇందు వచ్చి అడ్డుకుంటుంది. చిన్నపిల్లపై చేయిచేసుకోవడానికి బుద్ధిలేదా అంటుంది ఇందు, దారి తప్పుతుంది నువ్ ఐశ్వర్య అని ఇందు అంటే...నాకు చెప్పడానికి నువ్ ఎవరని ఐశ్వర్య అంటుంది. ఒక తల్లికి పుట్టకపోయినా మనం తోడబుట్టినవాళ్లమని ఇందు అంటుంది. మీ అమ్మ, మా అమ్మలు అక్కచెల్లెల్లైతే మనం ఒకటెలా అవుతాం, మా నాన్నని, మా నాన్నమ్మను మీ అమ్మే చంపింది, నేను ఎలా మరిచిపోతాను ఐశ్వర్య అంటుంది. నిన్ను చూసినప్పుడల్లా మీ అమ్మే గుర్తొస్తుంది, అందుకే చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తే నాకు అసహ్యం, అయినా ఎన్నిసార్లు ఛీ కొడుతున్నా మళ్లీ మాట్లాడేందుకు ప్రయత్నిస్తావెందుకని ఐశ్వర్య అంటుంది. నేను ఇంటి మహారాణిని, నువ్వు పనిమనిషివని ఐశ్వర్య ఇందును అవమానిస్తుంది.

67
ఇందును అవమానించిన ఐశ్వర్య

ఇంతలో అపర్ణ వచ్చి ఐశ్వర్యను తిడుతుంది. ఆడదంటే అణుకువగా ఉండాలి, మనషులతో మర్యాదగా ఉండాలి, తనను నీచెల్లెలిగా కాకపోయినా మనషిగా అయినా గుర్తించు అంటుంది. ఇలాగే మాట్లాడాతాను అని ఐశ్వర్య అంటుంది. నాతో ఎలా మాట్లాడినా పర్లేదు, నాన్నమ్మతో అయినా పద్ధతిగా మాట్లాడు అని ఇందు అంటుంది. పద్ధతుల గురించి మీరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఐశ్వర్య అంటుంది. ఇలాంటి వాళ్లకు ఎంత గడ్డి పెట్టినా ప్రయోజనం ఏముంటుందని భ్రమరాంబ అంటుంది. స్వాతి కలుగజేసుకుని...అమ్మా నువ్ కూడా ఐశ్వర్యనే సపోర్ట్ చేస్తున్నావేంటి అని స్వాతి అడుగుతుంది. ఇంత వయసొచ్చినా ఎవరితో తిరగాలో తెలీదా అని భ్రమరాంబ అంటుంది. అసలు వీళ్లను ఇంట్లో పెట్టుకోవడమే పెద్ద తప్పు అని ఐశ్వర్య అంటుంది. 

77
గత విషయాలను గుర్తుచేసుకుని బాధపడ్డ అపర్ణ

అటు రేఖ వచ్చి బతకమని వదిలేస్తే బుద్ధి మాత్రం మారలేదని అంటుంది. ఈరోజు శివరాం ఇంటికి వంట చేయడానికి వెళ్లాలని గుర్తులేదా అని ఇందును రేఖ అంటుంది. వెళ్లి ఇంట్లో అందరికీ టిఫిన్‍, వంట చేసి శివరాం ఇంటికి వెళ్లు అని చెప్తుంది. మిమ్మల్ని నేనే కాదు, నా మేనకోడలు కూడా క్షమించదని రేఖ అపర్ణతో అంటుంది.

ఇక్కడ అపర్ణ గత విషయాలను గుర్తుకుతెచ్చుకుని బాధపడుతుంది. ఏమైందని సుభాష్ అడిగితే..కావ్య, అప్పు, స్వప్న ఎలా ఉండేవాళ్లు, ఒకరంటే ఒకరికి ప్రాణం, ఎవరికి కష్టమొచ్చినా సాయం చేసుకునేవాళ్లు, కానీ వాళ్ల పిల్లలు మాత్రం ఇలా తయారయ్యారేంటని బాధపడుతుంది. అసలు నందు ఎక్కడుందో, బతికుందో, చచ్చిపోయుందో అని ఏడుస్తుంది,ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories