Trending Song: మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ .. ఏం పాటరా బాబు.. మైండ్ లో నుంచి పోవట్లేదు..!

Published : May 27, 2026, 05:48 PM IST

 Trending Song: యూట్యూబ్ లో ఒక సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ పాట రిలీజ్ చేసిన కేవలం మూడు రోజుల్లోనే మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చేశాయి. ఇక ఈ పాట ఒక్కసారి వింటే.. ఎవరికైనా తిరిగి హమ్ చేయాలి అనిపించేలా ఉంది.. 

PREV
13
Trending Song

యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కి పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో చిన్న చిన్న డ్యాన్స్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత యూత్ నచ్చేలా షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నడు. తర్వాత ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. అక్కడ ఫ్యాన్స్ సపోర్ట్ తో రన్నర్ గా నిలిచాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వరసగా సినిమా ఆఫర్లు అందుకొని బిజీ అయ్యాడు. ఇక... తన ఫ్యాన్స్ కోసం ఎలాంటి సాంగ్స్ చేయడు అని అనుకుంటున్న సమయంలో... ఓ పాటతో తన అభిమానుల ముందుకు వచ్చాడు.. అదే ‘ నిలువనివ్వదే’ పాట.

23
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న షణ్ముఖ్

ఈ పాటలో.. షణ్ముఖ్ తో పాటు మరో యూట్యూబ్ బ్యూటీ చాందన పయ్యావుల నటించారు. ఇదేదో నార్మల్ డ్యాన్స్ వీడియోలా కాకుండా.. సినిమాటిక్ ఫీల్ తీసుకువచ్చేలా ఈ పాట డిజైన్ చేశారు. ఒక కథ ద్వారా.. పాటను చెప్పడానికి ప్రయత్నించారు.‘ ఒక టైలర్ కొడుకు.. ఎదురింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇక అమ్మాయి కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. తనకు అందంగా రెడీ అవ్వాలని, ఫ్యాషన్ షో చేయాలనే కోరిక ఉంటుంది. కానీ వాళ్ల నాన్న కనీసం ఆమెకు అద్దం కూడా ఇవ్వడు. ఆ అమ్మాయి కోసం.. ఆ అబ్బాయి ఒక రోజు స్పెషల్ గా ఒక బ్లౌజు స్వయంగా డిజైన్ చేసి.. ఆమెను అందంగా రెడీ చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి ఆ అమ్మాయి వాళ్ల నాన్న వచ్చేస్తాడు. గొడవ జరుగుతుంది. ఇక ఆ అమ్మాయి.. అబ్బాయి ఇద్దరూ కలిసి ఇళ్లు వదిలి వెళ్లిపోతారు’ కాన్సెప్ట్ ఇది. కానీ.. పాట మాత్రం వినడానికి చాలా బాగుంది. పాటకు తగినట్లుగా వాళ్లు వేసిన స్టైప్స్ కూడా అదిరిపోయాయి. దీంతో.. పాట సూపర్ వైరల్ గా మారింది.

33
మిలియన్ వ్యూస్...

చాలా రోజుల తర్వాత షణ్ముఖ్ నుంచి ఈ పాట రావడంతో... అభిమానులు సంబరపడిపోతున్నారు. పాట అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.పాట విడుదల చేసిన మూడు రోజుల్లోనే మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు 1.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.  ఇక.. ఈ సాంగ్ సంగతి పక్కన పెడితే.. షణ్ముఖ్ ప్రస్తుతం ‘ ప్రేమకు నమస్కారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. మరో వైపు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నాడు. ఇటీవల వైష్ణవి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగగా.. త్వరలోనే పెళ్లి జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories