బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఎంతో మంది యువకుల జీవితాలు పవన్ కళ్యాణ్ నాశనం చేస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది.
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పాప్యులర్ అయ్యింది. బూతులు మాట్లాడుతున్న తమన్నాను మూడో వారమే ఎలిమినేట్ చేసి పంపారు. కాగా తమన్నా రాజకీయాల్లోకి కూడా వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది.
28
Tamannah Simhadri
మంగళగిరి జనసేన సీటు ఆమె ఆశించింది. రాకపోవడంతో ఇండిపెండ్ గా నిలబడింది. జనసేన సానుభూతిపరురాలైన తమన్నా సింహాద్రి గతంలో తన మద్దతు ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, 24 సీట్లకు పరిమితం కావడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
38
Pawan Kalyan, Janasena
తమన్నా సింహాద్రి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని కాపు యువకులు, ప్రజలు రోడ్డెక్కారు. పోరాటాలు చేస్తున్నారు. వారు తమ ఉద్యోగాలు కూడా వదిలేసుకొని వచ్చి పవన్ కోసం పని చేస్తున్నారు. అలాంటి వాళ్ళ జీవితాలు పవన్ కళ్యాణ్ నాశనం చేశాడు.
48
chandrababu naidu -pawan kalyan
చంద్రబాబు కోసం జనసేన కార్యకర్తలను ముంచేశాడు. నాదెండ్ల మనోహర్ మాట వింటున్న పవన్ కళ్యాణ్ కాపు పెద్దలు, జనసేన కార్యకర్తలను కలవడం లేదు. వాళ్లతో మాట్లాడటం లేదు. వంగవీటి రంగ తర్వాత కాపులకు ఒక నాయకుడు దొరికాడని మేము ఆశించాము.
58
chandrababu naidu -pawan kalyan -lokesh
కానీ జనసేన పార్టీ గెలవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మేము ప్రయత్నం చేస్తుంటే... ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అనుకుంటున్నాడు. జనసేస కోసం పనిచేస్తున్న వాళ్ళను మోసం చేస్తున్నాడు.
68
2019లో జనసేన సీటు కోసం ఆయన్ని కలవాలి అనుకున్నాను. కనీసం ఆయన నన్ను కలవలేదు. పవన్ కళ్యాణ్ కూడా సీటు కోసం కోట్లు తీసుకుంటే నా లాంటి సామాన్యులు ఏం కావాలి. ఎలా రాజకీయాల్లోకి రావాలి. ఆయన స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది.
అవుతున్నాయి...
78
Jana Sena, Pawan Kalyan, Andhra Pradesh
నీకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు. జనసేన కోసం పని చేసిన వాళ్లకు ఇవ్వండి. చంద్రబాబు, మనోహర్ మాటలు విని జనసేన నాయకులను నాశనం చేయకండి. ముద్రగడ పద్మనాభం ని కలుస్తానని చెప్పి కలవలేదు. ఇదే చంద్రబాబు అప్పుడు ముద్రగడ అనేక బాధలకు గురి చేశాడు.
88
Pawan Kalyan
ముద్రగడనే కలవని మీరు నాలాంటి ట్రాన్స్ జెండర్ ని ఎలా కలుస్తారు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల్లో పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు... అని ఆమె అన్నారు. తమన్నా సింహాద్రి ఆరోపణలు వైరల్
అవుతున్నాయి...