వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ చిత్రానికి తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ మొదలైంది. దీనితో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు అందరిలో అంతగా అంచనాలు లేవు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. కానీ కొన్ని నెలల క్రితం నుంచి మొత్తం పరిస్థితి మారిపోయింది. టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక యశ్ పాన్ ఇండియా స్థాయిలో మరో గ్రాండ్ సక్సెస్ కొట్టేశాడు అని అంతా భావించారు.
25
గీతూ మోహన్ దాస్ దర్శకత్వం
ఈ చిత్రం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. దర్శకురాలిగా ఆమెకి పెద్ద అనుభవం కూడా లేదు. అందుకే బిగినింగ్ లో అంచనాలు ఏర్పడలేదు. అయినప్పటికీ ట్రైలర్ లో విజువల్స్ చూసి ఈ దర్శకురాలు ఎవరో కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతోంది అని అంతా అనుకున్నారు. తాజాగా సినిమా రిలీజ్ అయ్యాక తొలి షో నుంచి అభిమానుల అంచనాలు తారుమారు అయ్యాయి. గీతూ మోహన్ దాస్, యశ్ అండ్ టీం ఏమాత్రం సోల్ లేని కథతో హంగామా చేశారు అని తేలిపోయింది.
35
బిల్డప్ మాత్రమే, కథలో దమ్ము లేదు
తొలి షో నుంచే టాక్సిక్ పై విమర్శలు మొదలయ్యాయి. సినిమా మొత్తం యశ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, గ్రాండ్ విజువల్స్ మాత్రమే హైలైట్ అని అంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే కంప్లీట్ గా తేడా కొట్టేసింది అని క్రిటిక్స్ రివ్యూలు ఇస్తున్నారు. దీనితో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. అసలు గీతూ మోహన్ దాస్ ఎవరంటే.. ఆమె కేరళకు చెందిన మహిళ.
సౌత్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా నటించారు. టాలీవుడ్ లో తో కూడా ఆమెకి కనెక్షన్ ఉంది. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన వీడెక్కడి మొగుడండీ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. లైయర్స్ డైస్, మూతన్ చిత్రాలతో దర్శకురాలిగా ప్రతిభ చాటారు. రెండు సినిమాలకే ఏకంగా యశ్ తో పాన్ ఇండియా ప్రాజెక్టు తెరకెక్కించే ఛాన్స్ దక్కిచుకున్నారు. కానీ ఆ గోల్డెన్ ఆపర్చునిటీని గీతూ మోహన్ దాస్ సద్వినియోగం చేసుకోలేదు అనే చెప్పాలి.
55
దిల్ రాజు మాటలే నిజామయ్యాయి
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. టాక్సిక్ సినిమా ప్రకటించినప్పుడు.. యశ్ కి ఏమైనా పిచ్చా.. కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత కొత్త దర్శకురాలితో సినిమా చేస్తున్నారు ఏంటి అని అనుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయి. యశ్ టాక్సిక్ మూవీ తో రాంగ్ స్టెప్ వేసినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో టాక్సిక్ చిత్రాని దిల్ రాజు భారీ ధరకు కొని రిలీజ్ చేశారు. మరి యశ్ క్రేజ్ ఈ చిత్రాన్ని కమర్షియల్ గా ఏ మేరకు కాపాడుతుందో చూడాలి.