వాటిలో ఏది టచ్‌ చేసినా దెబ్బలే.. చిరంజీవి నటుడిగా మారడం వెనుక అసలు కారణాలు

First Published | Jan 6, 2025, 7:49 PM IST

చిరంజీవి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్‌ గా ఎదిగాడు. కానీ ఆయన సినిమాల్లోకి రావడానికి, నటుడిగా మారడానికి బలమైన కారణం ఉందట. దాన్ని రివీల్‌ చేశాడు.
 

మెగాస్టార్‌ చిరంజీవి.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి మొదటి తరం హీరోల తర్వాత రెండో తరం నటుల్లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నటుడు. ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న వారిలో టాప్‌లో ఉన్న హీరో. కమర్షియల్‌ సినిమాకి కొత్త అర్థాన్ని చెప్పి తిరుగులేని స్టార్‌ హీరోగా ఎదిగారు. మెగాస్టార్‌ గౌరవించబడుతున్నారు. 

అయితే చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చారు. స్యయంకృషితో ఎదిగాడు. ఎలాంటి నెగటివిటీకి పోకుండా, తన లక్ష్యం కోసం పనిచేశాడు, నిరంతరం శ్రమించాడు. ఎన్నో అవమానాలు ఫేస్‌ చేశాడు, ఎన్నో నిరాశలు ఎదుర్కొన్నారు. కానీ సినిమాల్లో సక్సెస్‌తో వాటికి సమాధానం చెప్పాడు. తన ఎదుగుదలతోనే అందరికి ఆన్సర్‌ ఇచ్చాడు. ఎక్కడా గర్వం చూపించలేదని ఇటీవల ఆయన ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో తెలిపారు. 

read more: మెగా డాటర్‌ సుస్మిత పెళ్లి రేర్ సంగీత్‌ వీడియో.. చిరు, వెంకీ, బన్నీ, చరణ్‌, సాయితేజ్‌, శ్రీజ కిర్రాక్‌ డాన్స్


చిరంజీవి సినిమాల్లోకి రావడానికి కారణమేంటి? అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. తాజాగా ఎవరికీ తెలియని నిజాలు బయటపెట్టాడు చిరు. తాను నటనవైపు ఆసక్తి చూపించడానికి కారణమేంటో వెల్లడించారు. తనకు స్పోర్ట్స్ అంటే ఇష్టం అట. స్కూల్‌కి వెళ్లడం, చదువుకోవడం ఇష్టం ఉండదుగానీ, గేమ్స్ అంటే ఆసక్తిగానే ఉండేవాడట. కానీ ఏ ఆట ఆడినా దెబ్బలు తగిలేవట. ఆ విషయాలు రివీల్‌ చేశారు చిరంజీవి.

ఏడు, ఎనిమిది క్లాస్‌లో బ్యాట్మింటన్‌ ఆడాడట. అపోజిట్‌ పర్సన్‌ గట్టిగా కొడితే ఆ బాల్‌ వచ్చి కంటికి తగిలిందని, దీంతో కన్నువాచిపోయిందట. ఇది బాగా లేదని చెప్పి, వాలీబాల్‌ ఆడాడట. అవతలి వ్యక్తి గట్టిగా బాల్‌ కొట్టడంతో తాను హ్యాండ్స్ తో టచ్‌ చేయాల్సింది, ఫింగర్స్ తో చేశాడట. దీంతో వేళ్లు వంగిపోయి నొప్పిపెట్టాయి. అది భయమేసిందట. దాన్ని కూడా వదిలేశాడు. 

అనంతరం క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకున్నాడట. క్రికెట్‌ ఆడేటప్పుడు బాల్‌ వచ్చి బొటన వేలుకి తగిలితే వేలు వాచిపోయింది. దీంతో గేమ్స్ అంటేనే భయమేసిందట. తనకు గేమ్స్ అచ్చి రావడం లేదని బాదపడ్డాడట. ఏం చేయాలనుకున్నప్పుడు బీకామ్‌ చదువుకునే సమయంలో ఎన్‌సీసీలో చేరాడట.

నావెల్‌ ఎన్‌సీసీలో మంచి స్థాయికి వెళ్లాడట. ఎన్‌సీసీలో కెప్టెన్‌ అయ్యాడట. రిపబ్లిక్‌ డే వేడుకల్లో సైనికులతోపాటు కవాతు చేశాడట. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ముందు తాను ఆ కవాతు చేయడంతో ఇది కదా తాను సాధించింది అని ఎంతో సంతోషించాడట చిరంజీవి.
 

అది అయిపోయింది. కానీ నెక్ట్స్ ఏంటి? అన్నప్పుడు ఓ డైలామా ఏర్పడింది. కాలేజీలో ఓ నాటకం ప్రదర్శించారు. రాజీనామా అనే నాటకంలో ఛైర్మెన్‌ పాత్ర పోషించి అదరగొట్టాడట. బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా వచ్చింది.  అందరు క్లాప్స్ కొడుతున్నారు. ప్రశంసిస్తున్నారు.

అంతకు ముందు తనని ఎవరూ పట్టించుకునేవారు కాదని, ఆ తర్వాత అంతా తనవైపు చూస్తున్నారని గర్వంతో ఒప్పొంగిపోయాడట. అమ్మాయిలు రియాక్షన్‌ చూసి మరింత సంబరపడ్డాడట చిరంజీవి. అప్పుడు నటనపై ఆసక్తి ఏర్పడింది. నటుడు కావాలనే కోరిక కి బీజం పడిందన్నారు చిరు.

also read: ఎన్టీఆర్‌ సినిమా నుంచి నన్ను తీసేశారు, ఐరన్‌ లెగ్‌ ముద్ర వేస్తారని కుంగిపోయా.. చిరంజీవి కామెంట్స్

అక్కడి నుంచి సినిమాల్లో రాణించాలని ప్రయత్నాలు చేశాడు. చెన్నై వెళ్లి యాక్టింగ్‌ స్కూల్‌లో చేరాడట. అందులో తన యాక్టింగ్‌, డాన్సులు చూసి సినిమా ఆఫర్లు వచ్చాయని, తాను ఎవరి ఆఫీసుల చుట్టూ తిరగలేదని, ఆ తర్వాత లీడ్‌గానూ ఆఫర్లు వచ్చాయని ఇది తన విజయంగా భావించినట్టు తెలిపారు చిరంజీవి. స్పోర్ట్స్ లో రాణించకపోవడం వల్ల యాక్టింగ్‌పై ఆసక్తి ఏర్పడిందని, అలా ఈ సినిమా రంగంలోకి వచ్చినట్టు చెప్పాడు చిరంజీవి. `అప్టా` బిజినెస్‌ ఈవెంట్‌లో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. 

VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సోషియో ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ కి ప్రయారిటీ ఉన్న మూవీ ఇది. వీఎఫ్‌ఎక్స్ డిలే అవుతుందని, దీంతో ఏప్రిల్‌లో ఈ మూవీ రావడం కష్టమే అని తెలుస్తుంది. 

read more: `కల్కి 2`లో కల్కిగా కనిపించేది ఎవరు? క్రేజీ లీక్‌ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. పాండవులు, కమల్‌ హాసన్‌ పాత్ర గురించి

Latest Videos

click me!