అమలా పాల్ ఫోటో షూట్
తమిళ పరిశ్రమలో అమల పాల్ స్టార్ హీరోయిన్స్ ఒకరు. అదే సమయంలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆమె హీరోయిన్ గా నటించిన 'సింధు సమవెలి' చిత్రం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ చిత్రం మన సంస్కృతిని దెబ్బతీసేలా ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అమలా పాల్ తన సినిమాలతో కంటే కూడా నెగిటివ్ పబ్లిసిటీతో పాప్యులర్ అయ్యింది.
అమలా పాల్ ఫోటో షూట్
అనంతరం ప్రభు సాల్మన్ దర్శకత్వంలో అమలా పాల్ విదార్థ్ కు జంటగా నటించిన చిత్రం 'మైనా'. ఆమెపై ఉన్న వ్యతిరేకతను ఈ చిత్రం పూర్తిగా మార్చివేసింది. ఒక దశలో తలపతి విజయ్ కు జంటగా నటించే స్థాయికి ఎదిగింది అమలా పాల్. స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకుంది. తనతో తలైవా, దైవ తిరుమగల్ వంటి చిత్రాలు చేసిన దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ని 2014లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకుని విడిపోయింది.
అమలా పాల్ ఫోటో షూట్
విడాకుల తర్వాత అమలా పాల్ వరుస పరాజయాలు చవి చూసింది. ఆమె కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. ఆమె కథానాయికగా నటించిన 'ఆడై' చిత్రం ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్ గా విఫలమైంది. అదేవిధంగా 'ఆడై' చిత్రంలో బోల్డ్ సన్నివేశాలలో నటించడం, ఆమెకు బ్యాక్ ఫైర్ అయింది. కొన్ని చిత్రాల నుండి కూడా అమలా పాల్ ని తొలగించారు.
అమలా పాల్ ఫోటో షూట్
దీని కారణంగా అమలా పాల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఒత్తిడి నుండి బయటపడేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో 2023 లో, జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. 2 నెలల గర్భవతి గా ఉన్న అమలా పాల్ జగత్ ని వివాహం చేసుకున్నారు. చాలా నిరాడంబరంగా అమలా పాల్ వివాహం జరిగింది.అమలా పాల్ - జగత్ దేశాయ్ దంపతులకు గత ఏడాది జూన్ నెలలో అందమైన మగబిడ్డ జన్మించగా, అతనికి ఇలై అని పేరు పెట్టారు. తన భర్త బిడ్డతో కలిసి దిగిన ఫోటోలను అప్పుడప్పుడు అమలా పాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ట్రెడిషనల్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది.