రాజమౌళి - మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా కోసం హీరోయిన్ గా ప్రియాంక చోప్రా దాదాపు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈసినిమా కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత..?
actress Priyanka Chopra has landed in Hyderabad report says she act in SS Rajamouli-mahesh babu movie
రీసెంట్ గానే ఓపెనింగ్ అయ్యింది రాజమౌళి - మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ. భారీబడ్జెట్ తో..అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈమూవీ కోసం హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రీయాంక చోప్రాను తీసుకున్నారట రాజమౌళి. అంతే కాదు రీసెంట్ గా ఈసినిమా కోసం ఆమె హైదరాబాద్ లో కూడా లాండ్ అయ్యింది. అయితే ప్రియాంక కేవలం లుక్ టెస్ట్ కోసం ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమాలో నటించబోయే ఆర్టిస్ట్ ల లుక్ టెస్ట్ లు అయిపోయాయట.
ఇక రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఈసినిమా కు సబంధించి ఒక్క న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో నటించినందుకు ప్రియాంక చోప్రా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది..? ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. బాలీవుడ్ నటి అయిన ఆమె.. హాలీవుడ్ పాప్ స్టార్ నిక్ జోనస్ ను పెళ్ళి చేసుకుని లాస్ ఏంజిల్స్ లో ఉంటోంది.
హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లు చేసుకుంటున్న ఆమె.. అక్కడ ఒక్క ప్రాజెక్ట్ కు 45 కోట్ల వరకూ తీసుకుంటుందట. మరి అంత తీసుకునే ఆమె.. రాజమౌళి - మహేష్ బాబు సినిమాకు ఎంత డిమాండ్ చేసింది అంటే.. ఈసినిమాకు పక్కాగా ఆమెకు 80 కోట్ల ముట్టచెప్పాల్సిందే. అయితే రాజమౌళిమాత్రం ఆమెకు 30 కోట్ల వరకే ఆఫర్ చేశారట. బల్క్ గా రెండేళ్ళు డేట్స్అడిగాడట. మరి ఈ ప్రాపోజల్ కు ప్రియాంక ఓకే అనిందా..?
అంటే.. జక్కన్న సినిమా అంటే అందరికి నమ్మకం ఎక్కువ. పక్కాగా ఈసినిమా ఆమెకు ప్లాస్ అవుతుంది అన్న నమ్మకం ఉంది కాబట్టే ప్రియాంక రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా చేయడం కోసం ఒకే చెప్పినట్టు సమాచారం. ఇక ప్రియాంక రెమ్యునరేషన్ కు సబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. అఫీషియల్ గా వారుమాత్రం ఏం ప్రకటించలేదు. చూడాలి మరి ఈసినిమా ఎలా ఉండబోతోందో..?