2025 లో భారీగా వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలు ఏంటి? హైయోస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఆ మూవీదే

Published : Aug 24, 2025, 01:21 PM IST

ఈ ఏడాది ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఎనిమిది నెలలు భారీ సినిమాలు, చిన్న సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే అందులో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన సినిమాలేంటి.

PREV
16

2025 భారీ వసూళ్లు సాధించిన సినిమాలు

2025లో భారత సినిమా పరిశ్రమ ఎన్నో భారీ చిత్రాలను తెరపైకి తీసుకొచ్చినప్పటికీ, చాలా సినిమాలకు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. పుష్ప 2 తరహాలో బ్లాక్‌బస్టర్ హిట్‌లు చాలా తక్కువగా నమోదయ్యాయి. పెద్ద సినిమాలు ఎన్ని వచ్చినా.. ఈసారి చిన్న సినిమాలు సాధించిన విజయం ముందు పాన్ ఇండియా సినిమాలు కూడా చిన్నబుచ్చుకోక తప్పలేదు.

26

ఛావా

బాలీవుడ్ లో విక్కీ కౌశల్ నటించిన హిస్టారికల్ డ్రామా ‘ఛావా’ (Chhava) మాత్రం ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.రూ. 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మిచబడిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 808.70 కోట్లు వసూలు చేసి 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, సాంకేతికంగా, కథా పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

36

సైయారా

ఇక చిన్న సినిమాలు సత్తా చాటాయని ముందే చెప్పుకున్నాం కదా..? ఎప్పుడూ టాలీవుడ్ లో చిన్న సినిమాలు సత్తా చాటేవి కాని ఈసారి బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ తక్కువ బడ్జెట్‌ సినిమా బాక్సాఫీస్ ను వణికించింది. ఆసినిమా మరేదో కాదు ‘సైయారా’ (Saiyaara). విడుదలైన కొన్ని వారాల పాటు మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, తర్వాత వచ్చిన కూలీ  వార్ 2 వంటి భారీ సినిమాల ప్రభావంతో నిలకడ కోల్పోయింది. అయినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 542.40 కోట్లు వసూలు చేసి 2025లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

46

కూలీ

ఇక ప్రస్తుతం థియేటర్లను దడదడలాడిస్తున్న రెండు సినిమాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ (Coolie) కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై ఇంకా 10 రోజులు కూడా కాలేదు. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 441.30 కోట్లు వసూలు చేయడం విశేషం. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. కూలీ సినిమా ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఓవర్ ఆల్ కలెక్షన్ల రిపోర్ట్ వస్తే కూలీ స్థానం మారే అవకాశం ఉంది.

56

వార్ 2

ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 (War 2) కూడా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లు సాధిస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈసినిమా ఇప్పటి వరకూ 300 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటింది. వసూళ్ల పరంగా కూలీ తరువాతి స్థానంలో ఉన్న వార్ 2, 2025లో నాలుగో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. వార్ 2 ను యష్ రాజ్ ఫిల్మస్ 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించినట్టు సమాచారం.

66

సంక్రాంతికి వస్తున్నాం

తెలుగు సినిమాల్లో, సంక్రాంతికి  వస్తున్నాం’ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది టాలీవుడ్‌లో టాప్‌ గ్రాసర్‌గా నిలిచింది.ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మరో బాలీవుడ్ సినిమా హౌస్‌ఫుల్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్లు వసూలు చేసింది.ఇవి కాకుండా మోహన్ లాల్ నటించిన ఎంపురాన్, ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించాయి.

Read more Photos on
click me!

Recommended Stories