జగపతిబాబు చేసిన పనికి లక్షల్లో మోసపోయిన హీరో, ఇప్పటికీ ఇద్దరికి మాటల్లేవ్‌

First Published | Nov 23, 2024, 7:54 PM IST

జగపతిబాబు బోల్డ్ అండ్‌ డేర్‌. కానీ హీరోగా ఆయన మహిళల్లో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరో. అలాంటిది ఆయన వల్ల ఓ హీరో లక్షల్లో నష్టపోవడం గమనార్హం. 
 

జగపతిబాబు మ్యాన్లీ హీరోగా మెప్పించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన హీరోగా నిలిచారు. ఆయన హీరోగా చేసే సమయంలో మహిళల్లో మంచి క్రేజ్‌ ఉండేది. బాగా ఇష్టపడేవారు కూడా. అందుకే ఆయన సినిమాలు మిగిలిన టాప్‌ స్టార్స్ కి దీటుగా ఆదరణ పొందేవి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండేవి. ఇలా స్టార్‌ హీరోగా రాణించారు జగపతిబాబు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Jagapathi Babu

టాప్‌ స్టార్స్ గేమ్‌ పక్కన పెడితే సెకండ్‌ లీగ్‌లో జగపతిబాబు, శ్రీకాంత్‌, జేడీ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్‌, వేణు తొట్టేంపూడి, ఆదిత్య ఓం, శివాజీ, శివాజీ రాజా వంటి హీరోలు రాణించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ ఎంటర్టైనర్‌ చిత్రాలతో మెప్పించారు. వారిలో ప్రముఖంగా నిలిచారు జగపతిబాబు.

ఆయన తన రేంజ్‌ హీరోలతో చాలా మల్టీస్టారర్‌ చిత్రాలుచేశారు. అలా వేణు తొట్టెంపూడితోనూ కలిసి సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో `హనుమాన్‌ జంక్షన్‌`, `ఖుషీ ఖుషీగా` చిత్రాలు వచ్చాయి. ఓ రకంగా వారి రేంజ్‌లో పెద్ద బ్లాక్‌ బస్టర్స్ అని చెప్పొచ్చు. 


ఇదిలా ఉటే జగపతిబాబు, వేణు తొట్టెంపూడి మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరు బాగా క్లోజ్‌గా ఉండేవారు. కానీ ఆ క్లోజ్‌నెస్‌ బెడిసి కొట్టింది. మనీ మ్యాటర్‌ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగింది. అది చాలా దూరం వెళ్లింది. ఇప్పటికీ ఇద్దరి మధ్య మాటలు లేని పరిస్థితి వరకు వెళ్లాయి.

మరి ఇంతకి ఏం జరిగింది, ఇద్దరి మధ్య గొడవేంటి? అనేది చూస్తే.. ఒకరికి డబ్బులు ఇచ్చే విషయంలో వెనకాముందు అవుతుంటే మధ్యలో జగపతిబాబు వచ్చాడట. తనది హామీ మనీ ఇవ్వు అన్నాడట. వేణుకి మాత్రం డౌట్‌గానే ఉంది. కానీ జగపతిబాబు చెప్పాడని ఇచ్చాడు. 
 

తీరా ఆ వ్యక్తి మనీ విషయంలో హ్యాండిచ్చాడట. తనకు చెల్లించలేదట. ఆ తర్వాత జగపతిబాబు కూడా దాన్ని పట్టించుకోలేదట. దీంతో వేణు బాగా హర్ట్ అయ్యాడు. అంతేకాదు భారీ స్థాయిలో మోసపోయారు. సుమారు రూ.15 లక్షలు నష్టపోయినట్టు తెలిపారు. ఇరవై ఏళ్ల క్రితం 15లక్షలు అంటే ఇప్పుడు కోట్లల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 15కోట్లు. అప్పట్లోనే అది తనకు చాలా పెద్ద దెబ్బ అని వెల్లడించారు వేణు. 
 

అయితే దీనిపై జగపతిబాబు రియాక్ట్ కాకపోవడం తనకు బాధకలిగించిందని, ఆ తర్వాత తాము ఎప్పుడూ కలవలేదని, మాట్లాడుకోలేదని తెలిపారు వేణు . ఆయన రెండేళ్ల క్రితం రవితేజ హీరోగా వచ్చిన `రామారావు ఆన్‌ డ్యూటీ` చిత్రంలో నటించారు. చాలా గ్యాప్‌ తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేసిన మూవీ అది. కానీ డిజాస్టర్‌ అయ్యింది.

అనంతరం `అతిథి` అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. ఆ సమయంలోనే ఓ యూట్యూబ్‌(ట్రీ మీడియా)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు వేణు. తమ మధ్య గొడవకి కారణమేంటి? అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకి ఈ విషయాన్ని వెల్లడించారు వేణు. రీఎంట్రీ చేదు అనుభవం మిగిల్చడంతో మళ్లీ సినిమాలకు దూరమయ్యారు వేణు. వ్యాపారాల్లో ఆయన బిజీగా ఉన్నారు. 

read more:పవన్‌ కళ్యాణ్‌ మూవీ ఆగిపోయిందా? మరో సినిమా కూడా డౌటే? ఫ్యాన్స్ లో ఆందోళన!

also read: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ.. ఎలాంటి రోల్స్ చేయాలని ఉందో మనసులో మాట బయటపెట్టిన ఫైర్‌ బ్రాండ్
 

Latest Videos

click me!