సౌత్ సినిమాలో నటన, డాన్స్‌తో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది శోభన. చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్‌తో నటించిన ఆమె, భరతనాట్య కళాకారిణిగా ఇంటర్నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల్లో పీక్ స్టేజ్‌లో ఉన్నా, శోభన తన డాన్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. పెళ్లి చేసుకోని ఆమె, ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. కళ, కుటుంబం కలగలిపి తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది.