ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అపూర్వ ఎలిమినేటో అయినట్టు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజం అయితే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా షాలినీ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లవచ్చన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ముఖ్యంగా రోహిత్ గేమ్‌ను కూడా షాలిని తన ప్రవర్తన ద్వారా దెబ్బతీసిందనే టాక్ గట్టిగా వినిపించింది. కంటెంట్ కోసం గేమ్‌ను పక్కనపెట్టి అతిగా ప్రవర్తిస్తే బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు నిలబడలేరని ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా స్పష్టం చేస్తున్నారు. .
ఈ వారం నామినేషన్లలో నిలిచిన వారిలో అత్యల్పంగా ఓట్లు సాధించడం , ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అపూర్వ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆట కంటే అతి ప్రవర్తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఎలిమినేషన్‌తో హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు గట్టి సంకేతం వెళ్లినట్లయింది. మరి ఇందులో నిజమెంత? ఏం జరగబోతుంది అనేది చూడాలి. మిగతా గేమ్స్ ఎలా మారుతాయి అనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.