3. జానీ లివర్
జానీ లివర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, ప్రసిద్ధ హాస్యనటుడు. బాలీవుడ్‌లోని దాదాపు ప్రతి కామెడీ చిత్రం జానీ వంటి కళాకారుడు లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తుంది. జానీ నటించిన ప్రసిద్ధ చిత్రాలలో 'హౌస్‌ఫుల్' (ఫ్రాంచైజీ), 'హేరా ఫెరి' (ఫ్రాంచైజీ) మరియు 'దే దనా దన్' మొదలైనవి ఉన్నాయి. వార్తల ప్రకారం, వారు 277 కోట్ల రూపాయల ఆస్తికి యజమాని.
జానీ లివర్ లివర్ గురించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆయన స్వతహాగా తెలుగువారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 1957లో జానీ లివర్ తెలుగు క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం ముంబైకి వలస వెళ్ళింది. జానీ లివర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా లేబర్ గా కూడా పనిచేశారు.
ఆయన అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుమల. హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు తన సహచరుల వద్ద మిమిక్రీ స్కిల్స్ చూపించేవాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లో ప్రయత్నించి అవకాశాలు అందుకున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే జానీ లివర్ టాప్ 5 రిచెస్ట్ కమెడియన్లలో ఒకరిగా ఎదిగారు. అప్పుడప్పుడూ తన సొంత ఊరి కోసం జానీ లివర్ ప్రకాశం జిల్లాకి వస్తుంటారు.