మహేష్, ఎన్టీఆర్, బన్నిలతో సూపర్ హిట్లు
డీజే తర్వాత పూజా హెగ్డే వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ బాబుతో మహర్షి, మరోసారి బన్నీతో అల వైకుంఠపురములో లాంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. దీనితో పూజా హెగ్డే టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత పూజా హెగ్డేకి బ్యాడ్ టైం మొదలైంది.