Lenin Movie: లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయమేనా ?

Published : Jul 09, 2026, 07:51 PM IST

అఖిల్ నటించిన లెనిన్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. లెనిన్ మూవీ మిస్ కాకుండా చూడడానికి ఉన్న 5 కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
16
Lenin Movie

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్, సితార నాగవంశీతో పాటు అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. భారీ అంచనాలతో అఖిల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఒక్క హిట్ కూడా అందుకోలేదు. లెనిన్ చిత్రంతో అయినా అఖిల్ బోణీ కొడతాడేమో చూడాలి. మరికొన్ని గంటల్లో లెనిన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని చూడడానికి 5 ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
తొలి హిట్టు కోసం ఎదురుచూపులు

హీరోగా ఎంట్రీ ఇచినప్పటి నుంచి అఖిల్ తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ తో పాటు నాగార్జున, అక్కినేని అభిమానులంతా ఎదురుచూస్తున్నది దాని కోసమే. లెనిన్ మూవీ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో ఉంది.

36
చిత్తూరు బ్యాక్ డ్రాప్

అఖిల్ తొలిసారి తన కెరీర్ లో చిత్తూరు బ్యాక్ డ్రాప్ ఉన్న కథలో నటిస్తున్నారు. చాకొలేట్ బాయ్ లా ఉండే అఖిల్ రాయలసీమ నేపథ్యం ఉన్న కథకి ఎలా సెట్ అవుతాడు అనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో అఖిల్ అదరగొట్టేశాడు. ఇక సినిమాలో మెప్పించడమే మిగిలింది.

46
భాగ్యశ్రీ బోర్సే

గ్లామర్, పెర్ఫార్మెన్స్ పరంగా భాగ్యశ్రీకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా యువతకు ఆమె క్రష్ గా మారింది. కానీ ఇంత వరకు భాగ్యశ్రీకి సరైన హిట్ దక్కలేదు. లెనిన్ మూవీతో అయినా భాగ్యశ్రీ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

56
నిర్మాతగా నాగార్జున

తన వారసుడి కోసం నాగార్జున మరోసారి నిర్మాతగా మారారు. సితార సంస్థతో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

66
అఖిల్ కాన్ఫిడెన్స్

అఖిల్ లెనిన్ మూవీపై ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. గతంలో ఏ సినిమాకీ అఖిల్ ఇంత కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. దర్శకుడు నన్ను నమ్మడం వల్లే తన మేకోవర్ మార్చుకోగలిగాను అని అఖిల్ తెలిపారు. పెళ్లయ్యాక అఖిల్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే.

Read more Photos on
click me!

Recommended Stories