సమంత, నయనతారతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 5 హీరోయిన్ ఎవరంటే?

Published : Feb 11, 2025, 01:21 PM IST

Top 5 Highest Paid South Indian Actress :  ప్రస్తుతం ఇండియాలో సౌత్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఎక్కువ రెమ్యునరేషన్  తీసుకుంటున్నవారిలో సౌత్ నటీమణులు టాప్ లో ఉన్నారు. సౌత్ ఇండియాన్ హీరోయిన్స్ లో హైయెష్ట్ రెమ్యునేషన్ తీసుకుంటున్న స్టార్స్ ఎవరో తెలుసా?   

PREV
16
సమంత, నయనతారతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 5 హీరోయిన్ ఎవరంటే?
Top 5 Highest Paid South Indian Actress

Top 5 Highest Paid South Indian Actress : పాన్ ఇండియా సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హీరోలు, హీరోయిన్లు  కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. అంతేకాకుండా, పాన్ ఇండియా సినిమాలు వసూళ్లలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.

దీని కారణంగా నటులు, నటీమణుల పారితోషికం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. ఇక సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు ఎవరంటే.. ఇందులో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? 

26
సాయి పల్లవి

అమరన్ సినిమా విజయం తర్వాత నాగ చైతన్యతో కలిసి సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా తండేల్ 7వ తేదీన విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.  ఈ సినిమాకి సాయి పల్లవికి రూ.5 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు సమాచారం. 

36
నయనతార

పెళ్లయిన తర్వాత కూడా నంబర్ 1 హీరోయిన్ గా వెలుగుతోంది  నయనతార ప్రతి సినిమాకూ 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. 2018లో ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 100 మంది ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నటి నయనతార. ప్రస్తుతం ఆమె టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్, రాక్కాయి, MMMN వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

46
అనుష్క శెట్టి :

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్  అనుష్క శెట్టి ఇప్పుడు సినిమాల్లో నటించడం తగ్గించారు. 2020లో నిశ్శబ్దం సినిమాలో నటించారు. 3 సంవత్సరాల విరామం తర్వాత 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించారు. ఇప్పుడు కాది , కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ ప్రతి సినిమాకూ రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు  తీసుకుంటున్నారు.

56
రష్మిక మందన్న

అన్ని భాషల్లో ప్రస్తుతం స్టార్ గా ఉన్నారు  రష్మిక మందన్న. ఈమెకు పుష్ప సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు చారిత్రక కథలో నటిస్తున్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజు పెద్ద కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజు కథ ఆధారంగా చారిత్రక సినిమా తెరకెక్కుతోంది.  చావా టైటిల్ తో రూపొందుతున్న ఈమూవీ  ఫిబ్రవరి 14న విడుదల కానుంది. పుష్ప 2 సినిమాకి రష్మిక మందన్నకు 10 కోట్లు పారితోషికంగా ఇవ్వగా, చావా సినిమాకి  4 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.

66
సమంత :

నాగచైతన్యతో విడాకులు, తండ్రి మరణం, మయోసైటిస్ వ్యాధి వంటి సమస్యల నుంచి కోలుకుంటున్న సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించారు. ప్రతి సినిమాకూ 8 కోట్ల వరకు సమంత పారితోషికం తీసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories