Saif Ali Khan: స్పీడు రికవరీ, ఆటోలో హాస్పిటల్‌ కు వెళ్లటంపై సైఫ్ వివరణ

Published : Feb 11, 2025, 12:09 PM IST

Saif Ali Khan:  ‘ఆస్పత్రి నుంచి సైఫ్‌ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు.  ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. ఈ విషయమై సైఫ్ వివరణ ఇచ్చారు. 

PREV
14
Saif Ali Khan: స్పీడు రికవరీ, ఆటోలో హాస్పిటల్‌   కు వెళ్లటంపై సైఫ్ వివరణ
Saif Ali Khan Addresses Conspiracy Theories Surrounding His Speedy Recovery IN TELUGU


ప్రముఖ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకున్న సంగతి తెలిసిందే. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ విషయంగా  చర్చ నడిచింది.

ఈ క్రమంలో.. ఓ సైఫ్ మీడియాతో మాట్లాడారు.  జనాలకు వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సైఫ్‌ అలీ ఖాన్‌ ఇటీవల ఒక నేషనల్  మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలపై స్పష్టత ఇచ్చాడు. ఆ రాత్రి సమయంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం చేశారు అనే విషయాలను గురించి క్లీయర్‌గా సైఫ్ అలీ ఖాన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

24
Saif Ali Khan Addresses Conspiracy Theories Surrounding His Speedy Recovery IN TELUGU


సైఫ్ మీడియాతో మాట్లాడుతూ... కత్తితో తనను దుండగుడు పొడిచినట్లు మొదట అర్థం కాలేదని, ఆ తర్వాత తర్వాత అర్థం అయ్యిందని చెప్పుకొచ్చాడు. వీపు మీద గాయం గురించి తనకు మొదట తెలియదని అన్నాడు. రక్తం వస్తూ ఉండటాన్ని చూసి గాయాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నాడు. కరీనా ఆందోళన చెందుతూ ఉంటే పిల్లలను చూసుకోమని కంగారు వద్దని చెప్పానని తెలియచేసారు.

అలాగే మీ ఇంట్లో కార్లు ఉన్నాయి కదా ఆటో మీద హాస్పటిల్ కు రావటం ఏమిటనే విషయం గురించి చెప్తూ... ఆ సమయంలో డ్రైవర్స్ ఎవరూ ఇంట్లో లేరని చెప్పారు. రాత్రంతా ఎవరూ మా ఇంట్లో ఉండరు. వాళ్ల ఇళ్లకు వాళ్లు వెళ్తారు. మాతో పాటు కొందరు మా ఇంట్లో ఉంటారు కానీ వాళ్లెవరూ డ్రైవర్స్ కాదు. కారు డ్రైవర్ వచ్చేదాకా వెయిట్ చేసే పరిస్దితి కాదు అందుకే ఆటోలో హాస్పిటల్ కు వెళ్లానని అన్నారు.
 

34
Saif Ali Khan Addresses Conspiracy Theories Surrounding His Speedy Recovery IN TELUGU

‘ఆస్పత్రి నుంచి సైఫ్‌ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు.  ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. ఈ విషయమై సైఫ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.


అదే సమయంలో తను చాలా స్పీడుగా రికవరీ అవటం గురించి మాట్లాడుతూ...ఇలాంటి ప్రశ్నలు వస్తాయని నేను ఊహించాను. ప్రతీ విషయ మీదా జనం చర్చలు చేస్తూంటారు. కొందరైతే నమ్మరు. కొందరు ఫన్ చేసుకుంటారు కూడా. అయితే అది ప్రపంచ తీరు. ప్రతీ విషయం మీద జనం సానుభూతిగా మాట్లాడితే చాలా  ప్లాట్ గా డల్ గా ఉంటుంది. కాబట్టి ఆ విషయమై నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు.

44
Saif Ali Khan Addresses Conspiracy Theories Surrounding His Speedy Recovery IN TELUGU

అలాగే అప్పుడు నా పరిస్థితి చూసి తైమూర్‌ నాన్న... నువ్వు చనిపోతావా అంటూ ఆవేదనతో అడిగాడు. అప్పుడు అతడికి ధైర్యం చెప్పాను. ఆసుపత్రికి వెళ్లే సమయంలో తాను వస్తానంటూ తైమూర్‌ పట్టుబట్టాడు.

అప్పుడు నేను ఆసుపత్రిలో ఒకరు తనకు తోడు ఉండాలనే ఉద్దేశ్యంతో తైమూర్‌ను తీసుకు వెళ్లాను. నాకు ఏమైనా పక్కన కొడుకు ఉన్నాడనే నమ్మకం ఉంటుందని తీసుకు వెళ్లినట్లు సైఫ్ అలీ ఖాన్‌ పేర్కొన్నారు.
 
 

Read more Photos on
click me!

Recommended Stories