చేసింది 12 సినిమాలే, కానీ ఏకంగా 4వేల కోట్లు.. ఇండియా టాప్‌ బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా? టాప్‌ 5 లిస్ట్

Published : Nov 08, 2025, 04:58 PM IST

Top Directors: తమ సినిమాలతో అత్యధిక కలెక్షన్లు సాధించిన సౌత్‌ ఇండియా టాప్‌ 5 దర్శకులెవరో తెలుసుకుందాం. ఇందులో ఇద్దరు తెలుగు, ఇద్దరు తమిళ దర్శకులు ఉండటం విశేషం. 

PREV
17
అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్‌ డైరెక్టర్స్

సినిమా రంగంలో అందరికంటే ఎక్కువగా పేరొచ్చేది హీరోలకు మాత్రమే. ఆ తర్వాత హీరోయిన్లు మంచి పేరుని గుర్తింపుని పొందుతారు. దర్శకుల్లో కొందరికి మాత్రమే, పేరు గుర్తుంపు వస్తుంది. ఆ డైరెక్టర్లకి హీరోలకు మించిన ఇమేజ్‌, పాపులారిటీ ఉంటుంది. సినిమాలు కూడా వారి పేరుతోనే మార్కెట్‌ అవుతుంటాయి. ఒకప్పుడు రాఘవేంద్రరావు, బాలచందర్‌, విశ్వనాథ్‌, దాసరి నారాయణరావు, బాపు, జంధ్యాల, ఈవీవీ వంటి వారు అలాంటి కోవకు చెందినవారే. ఆ తర్వాత చాలా మంది దర్శకులు వచ్చారు. రాణిస్తున్నారు. ఇక ఇప్పటి తరంలో స్టార్‌ హీరోలతో సమానంగా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న దర్శకులు కొందరు ఉన్నారు. వీరు చేసింది తక్కువ సినిమాలే కాని బాక్సాఫీసుని షేక్‌ చేశారు. అలా తక్కువ సినిమాలతోనే వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిన సౌత్‌ టాప్‌ 5 డైరెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం.

27
12 సినిమాలతో రూ.4200 కోట్లు

తక్కువ సినిమాలతో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన దర్శకుల్లో రాజమౌళి ముందున్నారు. ఆయన ఇప్పటి వరకు 12 సినిమాలను రూపొందించారు. `బాహుబలి 1, 2`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `ఈగ`, `మగధీర`, `ఛత్రపతి`, `యమదొంగ`, `విక్రమార్కుడు`, `సింహాద్రి` వంటి చిత్రాలను రూపొందించారు. బాక్సాఫీసుని షేక్‌ చేశారు.  ఆయన చేసిన 12 సినిమాల టోటల్‌ కలెక్షన్లు రూ.4200కోట్లు కావడం విశేషం. ఇందులో `బాహుబలి` చిత్రాల ద్వారానే రూ.2500కోట్లు రాబట్టడం విశేషం. ప్రస్తుతం ఆయన మహేష్‌ బాబుతో `గ్లోబ్‌ ట్రోటర్‌`గా ఓ అంతర్జాతీయ స్థాయి మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మూడు వేల కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకున్నారని సమాచారం.

37
9 సినిమాలతో రూ.2550 కోట్లు

రాజమౌళి తర్వాత తక్కువ చిత్రాలతో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన దర్శకుడు సుకుమార్‌. క్రియేటివ్‌ జీనియస్‌గా పేరుతెచ్చుకున్న ఆయన `పుష్ప 2` చిత్రంతో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలతోపాటు `రంగస్థలం`, `ఆర్య`, `వన్‌ నేనొక్కడినే`, `నాన్నకు ప్రేమతో` వంటి సినిమాలను రూపొందించారు. ఇప్పటి వరకు ఆయన 9 సినిమాలు చేయగా, వారి సినిమాల టోటల్‌ కలెక్షన్ల గ్రాస్‌ రూ.2550కోట్లు కావడం విశేషం. ఇలా సౌత్‌లో టాప్‌ 2లో మన దర్శకులే ఉండటం మరో విశేషం.

47
నాలుగు సినిమాలతో రూ.2150 కోట్లు

ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన `కేజీఎఫ్‌` చిత్రాలతో దుమ్ములేపారు. కన్నడ సినిమా సత్తాని చాటి చెప్పారు. `కేజీఎప్‌2`తో ఇండియన్‌ సినిమాలో ఒక అలజడిని క్రియేట్‌ చేశారు. ఆ తర్వాత ప్రభాస్‌తో `సలార్‌`ని తెరకెక్కించారు. ప్రశాంత్‌ నీల్‌ చేసింది నాలుగు సినిమాలే కానీ ఆయన చిత్రాలు కలెక్షన్లు రూ.2150కోట్లు ఉండటం విశేషం. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌ తో `డ్రాగన్‌` మూవీ చేస్తున్నారు. దీంతోపాటు `సలార్‌ 2` చేయాల్సి ఉంది.

57
7 సినిమాలతో రూ.1800కోట్లు

తక్కువ సినిమాలతో ఎక్కువ వసూళ్లని రాబట్టిన దర్శకుల్లో లోకేష్‌ కనగరాజు నాల్గో స్థానంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు 7 చిత్రాలు చేశారు. ఇవి రూ.1800కోట్లు రాబట్టాయి. ఇటీవల వచ్చిన `కూలీ`, అంతకు ముందు వచ్చిన `లియో`, `విక్రమ్‌`, `మాస్టర్`, `ఖైదీ` వంటి చిత్రాలు ఆయన్నుంచే వచ్చాయి. ప్రస్తుతం ఆయన కార్తితో `ఖైదీ 2` చేసే పనిలో బిజీగా ఉన్నారు.

67
ఐదు సినిమాలతో రూ.1700కోట్లు

తక్కువ సినిమాలతో ఎక్కువ వసూళ్లని రాబట్టి టాప్‌ 5లో ఉన్న మరో దర్శకుడు అట్లీ. ఆయన ఐదు సినిమాలు చేశారు. ఆయన చిత్రాలు రూ.1700 కోట్లు రాబట్టాయి. ఇందులో `జవాన్‌` తో బాక్సాఫీసుని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నారు. దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీతో మూడు వేలకోట్లు టార్గెట్‌ చేశారు. ఇలా ఈ ఐదుగురు దర్శకులు చేసింది తక్కువ సినిమాలే అయినా కలెక్షన్ల పరంగా సౌత్‌ ఇండియాలోనే టాప్‌ 5లో ఉండటం విశేషం.

77
బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్స్ వీరే

ఇక నార్త్ లో చూస్తే దర్శకుడు నితీష్‌ తివారి మొదటి స్థానంలో ఉంటారు. ఆయన ఆరు సినిమాలు రూపొందించారు. కానీ `దంగల్‌` చిత్రంతో సంచలనాలు సృష్టించారు. ఆయన అన్ని సినిమాలు కలిపితే దాదాపు రూ.2500కోట్ల గ్రాస్‌ వచ్చాయి. దీంతో బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా నిలిచారు. ఇండియా వైడ్‌గా కౌంట్‌ చేస్తే,  ఆయన మూడో స్థానంలో ఉంటారు. ఆయన తర్వాత రాజ్‌ కుమార్‌ హిరానీ నిలిచారు. ఆయన ఇప్పటి వరకు 6 సినిమాలు రూపొందించారు. ఆయన సినిమాలు దాదాపు రూ.2380కోట్లు రాబట్టాయి. బాలీవుడ్‌లో రెండో స్థానంలో నిలవగా, ఇండియా వైడ్‌గా చూస్తే నాల్గో స్థానంలో ఉంటారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories