సూర్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసినిమా తెలుగు,తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది. శివ ఈసినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగు హీరో కానందుకు చాలామంది బాధపడుతుంటారు. మావాడు అని చెప్పుకోవాలి అని ఆరాటపడుతుంటారు.
తమిళ్ లో విడుదలైన సూర్య ప్రతి సినిమా తెలుగులోను డబ్ అవుతుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ సూర్య సినిమాలు దూసుకుపోతున్నాయి. ఇక ఈసారి కంగువాతో అంతకు మించి సాధించాలని చూస్తున్నాడు హ్యాండ్సమ్ హీరో. అందుకే కంగువ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు. టాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టి.. ఇంతకు ముందు కంటే ఎక్కువ ఈవెంట్లు ఇక్కడ చేస్తున్నాడు సూర్య.
Also Read: బాలయ్య ముందు నోరు జారిన అల్లు అర్జున్, పుష్ప 2 రిలీజ్ టైమ్ లో రిస్క్ చేయొదంటున్న అభిమానులు