`హిట్‌ 3` చూడ్డానికి ఐదు కారణాలు.. ఈ సారి నాని ఇచ్చే స్పెషల్‌ ఇదే

Published : May 01, 2025, 06:57 AM IST

Nani - Hit 3: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `హిట్‌ 3` నేడు గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మార్నింగ్‌ ఆటతో సందడి షురూ అవుతుంది. మరి ఈ సినిమా ఎందుకు చూడాలి? చూడ్డానికి ఐదు ప్రధాన కారణాలేంటి? అనేది తెలుసుకుందాం.   

PREV
15
`హిట్‌ 3` చూడ్డానికి ఐదు కారణాలు.. ఈ సారి నాని ఇచ్చే స్పెషల్‌ ఇదే
Nani starrer Hit 3

నాని ఇటీవల కాలంలో తన పంథామార్చుకున్నారు. ఫ్యామిలీ కథలు, లవ్‌ స్టోరీలను పక్కన పెట్టాడు. తాను మాస్‌ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియల్‌ హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. లాంగ్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు.

లవర్‌ బాయ్‌గా, నేచురల్‌ స్టార్‌గా ఉంటే ఎప్పటికీ అక్కడే ఉండిపోతామని భావించి ఇప్పుడు ఆయన మాస్‌, యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాలతో తన రేంజ్‌ని పెంచుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు `హిట్‌ 3`తో వస్తున్నారు. 

25

నిజానికి నాని `దసరా` మూవీ నుంచే తన రూట్‌ మార్చారు. దాన్ని నెమ్మదిగా ఇంప్లిమెంట్‌ చేస్తూ వస్తున్నారు. తాను ప్రయోగాత్మకంగా చేసిన చిత్రాలు వర్కౌట్‌ అయ్యాయి. అందుకే ఇప్పుడు `హిట్‌ 3`తోనూ దాన్ని కొనసాగిస్తున్నారు.

ఇది పూర్తి యాక్షన్‌, క్రైమ్‌ ప్రధానంగా రూపొందిన చిత్రం కావడం విశేషం. టీజర్, ట్రైలర్లో చూస్తే రక్తపాతం ఏరులైపారుతుంది. ఈ మూవీలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ గా నటించగా, శైలేష్‌ కొలను దర్శకుడు. నానినే నిర్మాత. 
 

35
Hit 3 Teaser:

`హిట్‌ 3` సినిమా ఎందుకు చూడాలంటే ఐదు ప్రధాన కారణాల్లో నాని మొదటి వరుసలో ఉంటారు. ఈ చిత్రంతో పూర్తి వాయిలెన్స్ కి ప్రయారిటీ ఇవ్వడం విశేషం. ఇలాంటి సినిమాల్లో నానిని ఎప్పుడూ చూడలేదు. అదే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది.

ఎలా మెప్పించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాక్షన్‌ సీన్లు అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తుంది. ఇక రెండో పాయింట్‌ `హిట్‌` ఫ్రాంఛైజీ విజయవంతంగా రన్‌ అవుతుంది. నాని సొంతంగా నిర్మించాడంటే కంటెంట్‌ పరంగా మంచి విషయం ఉందని అర్థం చేసుకోవచ్చు. 
 

45

మూడో కారణం.. నాని నటన. అది తన సినిమాల్లో ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీగానే ఉంటుంది. `హిట్‌ 3` విషయానికి వస్తే 1 నుంచి 3 వరకు అదే మెయిన్‌ కారణంగా చెప్పొచ్చు. ప్రీమియర్స్ ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు ఇందులో నాని నటన వేరే లెవల్‌లో ఉండబోతుందట. సినిమాకి అదే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. 
 

55

నాల్గో కారణం.. మిక్కీ జే మేయర్‌.. క్లాస్‌, మెలోడీ ట్యూన్స్ తో అలరించే మిక్కీ జే మేయర్‌ ఇలాంటి మాస్‌ బీజీఎం ఎలా అందించాడనేది క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది. వీటితోపాటు డైరెక్షన్‌, ఇతర టెక్నీకల్‌ అంశాలు ఇందులో భాగమనే చెప్పాలి. వీటితోపాటు ఐదో కారణం.. రిలీజ్‌ డేట్‌.

ఇప్పటి వరకు సమ్మర్‌లో సరైన సాలిడ్‌ మూవీ పడలేదు. ఆడియెన్స్ ని బాగా ఎంటర్‌టైన్‌ చేసే సినిమాలు రావడం లేదు. ఆ కొరత ఉంది. దీంతో నాని సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీఅంటుంటారు. ఆ ఉద్దేశ్యంతోనే ఈ మూవీని చూడొచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories