ముంబైకి చెందిన రూపిణి.. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ అగ్ర హీరోల సరసన నటించారు. 1987 నుంచి 1994 మధ్య కాలంలో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, సత్యరాజ్, విజయకాంత్, మోహన్, రామరాజన్ లాంటి స్టార్స్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
రజనీకాంత్ 'మనిదన్' సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన రూపిణి.. ఆ తర్వాత 'కూలిక్కారన్', 'అపూర్వ సగోదరర్గళ్', 'ఎన్న పెత్త రాసా', 'ఉళైప్పాళి' లాంటి హిట్ సినిమాల్లో నటించారు. 90ల్లో బిజీ హీరోయిన్‌గా ఉన్న ఆమె.. 1995లో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.