TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్

Published : May 31, 2026, 02:08 PM IST

తెలుగులో బుల్లితెర నటీమణులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు టీవీ సీరియల్స్ ని విపరీతంగా ఆదరిస్తారు. సీరియల్స్ లో నటించే నటీమణులలో అందంగా ఉంటూ ఆకర్షించే వారి జాబితా ఈ కథనంలో ఉంది. 

PREV
111
టాప్ 10 మోస్ట్ గ్లామరస్ టీవీ నటీమణులు

తెలుగు టీవీ సీరియల్స్ లో నటించే నటీమణులకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై ఫేమస్ అయి ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కూడానా ఛాన్సులు అందుకున్న వారు ఉన్నారు. తెలుగు టీవీ సీరియల్స్ లో నటించిన టాప్ 10 మోస్ట్ గ్లామరస్ నటీమణుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వీరిలో ప్రియాంక జైన్, తేజస్విని గౌడ, శోభా శెట్టి లాంటి వారు ఉన్నారు.

211
ప్రియాంక జైన్

ప్రియాంక జైన్ బుల్లితెరపై మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. జానకి కలగనలేదు, మౌనరాగం లాంటి సీరియల్స్ తో ప్రియాంక పాపులర్ అయింది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. ప్రస్తుతం తన గ్లామర్ తో కూడా ప్రియాంక యువతని ఆకట్టుకుంటోంది.

311
తేజస్విని గౌడ

బుల్లితెర నటుడు అమర్ దీప్ భార్యే తేజస్విని గౌడ. ఈ కన్నడ నటి కేరాఫ్ అనసూయ, కోయిలమ్మ లాంటి సీరియల్స్ నటించి గుర్తింపు పొందింది. అమర్ దీప్ ని ప్రేమించి వివాహం చేసుకుంది.

411
తనూజ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో తనూజ రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ షోలో తన అందంతో మెప్పించిన తనూజ బుల్లితెరపై ముద్దమందారం, అగ్నిపరీక్ష లాంటి సీరియల్స్ లో తన నటనతో మెప్పించింది.

511
కావ్య శ్రీ

కావ్యశ్రీ చాలా మంది యువతకు క్రష్. తన గ్లామర్ తో నటనతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. అమ్మకు తెలియని కోయిలమ్మ, గోరింటాకు లాంటి సీరియల్స్ లో కావ్యశ్రీ నటించింది.

611
శోభా శెట్టి

శోభా శెట్టి గురించి పరిచయం అవసరం లేదు. మోస్ట్ పాపులర్ టీవీ సీరియల్ కార్తీక దీపంలో నెగిటివ్ రోల్ లో నటించింది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని అదరగొట్టింది. బుల్లితెరపై ఆమె గ్లామర్ ఐకాన్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోజులతో పాపులారిటీ పొందింది.

711
అన్షు రెడ్డి

ఇల్లు ఇల్లాలు పిల్లలు టీవీ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్స్ తో స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ తో అన్షు రెడ్డి నటిగా మంచి గుర్తింపు పొందింది. ఆమె గ్లామరస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

811
మేఘన లోకేష్

నటి మేఘన లోకేష్ జీ తెలుగులో ప్రసారమయ్యే కళ్యాణ వైభోగం సీరియల్ తో గుర్తింపు పొందింది. ఆమె కూడా సినీ హీరోయిన్లని తలదన్నే అందంతో యువతని ఆకట్టుకుంటోంది.

911
రూప ముగ్గుల

పాపులర్ టీవీ సీరియల్ బ్రహ్మముడితో నటి రూప ముగ్గుల గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోస్ తెగ వైరల్ అవుతుంటాయి. ఆమె ఫోటోలకు అభిమానులు హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు.

1011
దీప్తి మన్నే

నటి దీప్తి మన్నే తెలుగులో రాధమ్మ కూతురు, జగద్ధాత్రి లాంటి సీరియల్స్ లో నటించి పాపులారిటీ సొంతం చేసుకుంది.

1111
జ్యోతి పూర్వాజ్

గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో జ్యోతి పూర్వాజ్ తల్లి పాత్రలో నటించింది. ఆమె వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. కానీ ఇప్పుడు గ్లామర్ విషయంలో హద్దులు చెరిపివేస్తోంది. సినిమాల్లో కూడా నటిస్తోంది. ఆమె గ్లామరస్ ఫోజులు నెట్టింట సంచలనం అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories