Top 10 Netflix Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. నెంబర్‌ 1లో ఉన్న మూవీ ఏంటంటే?

Published : Mar 09, 2026, 04:11 PM IST

Top 10 Netflix Movies: నెట్‌ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 సినిమాలు చూస్తే, మొదటి స్థానంలో సంచలనాత్మక మూవీ ఉండగా, టాప్‌ 10లో తెలుగు కామెడీ సినిమా దుమ్ములేపుతుంది. ఆ చిత్రాలేంటో చూస్తే. 

PREV
15
ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతోన్న `ధురంధర్‌`

నెట్‌ ఫ్లిక్స్ లో టాప్‌ 10 జాబితాలో మొదటి స్థానంలో ఇటీవల కాలంలో సంచలనాత్మకంగా నిలిచిన మూవీ `ధురంధర్‌` ట్రెండ్‌ అవుతుంది. ఇండియా వైడ్‌గా ఇది రచ్చ చేస్తోంది. ఈ నెల 19న `ధురంధర్‌ 2` రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మొదటి పార్ట్ ఓటీటీలో రచ్చ చేస్తుండటం విశేషం. రణ్‌వీర్‌ సింగ్‌, ఆర్‌ మాధవన్‌, అక్షయ్‌ ఖన్నా, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే మూవీ ఇది. మొదటి భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.1300కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.

25
నాల్గో స్థానంలో `అమర కావ్యం` ట్రెండింగ్‌

రెండో స్థానంలో `తస్కరేః ది స్మగ్లర్స్ వెబ్‌` అనే వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ అవుతుంది. ఇది జనవరి 14న స్ట్రీమింగ్‌ అయ్యింది.  మూడో స్థానంలో కపిల్‌ శర్మ నిర్వహిస్తున్న `ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌` షో ట్రెండ్‌ అవుతుంది. నాల్గో స్థానంలో ధనుష్‌, కృతి సనన్‌ నటించిన `తేరే ఇష్క్ మెయిన్‌` అనే మూవీ ట్రెండ్‌ అవుతుంది. ఇది బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం చాలా రోజులుగా ట్రెండ్‌ అవుతుండటం విశేషం. దీన్ని తెలుగులో `అమర కావ్యం` పేరుతో రిలీజ్‌ చేశారు. 

35
ఐదో స్థానంలో ఐశ్వర్య రజనీకాంత్‌ `విత్‌ లవ్‌`

టాప్‌ 5లో తమిళ మూవీ ఉంది. ఐశ్వర్య రజనీకాంత్‌ నిర్మించిన `విత్‌ లవ్‌` అనే సినిమా ట్రెండ్‌ అవుతుంది. ఇందులో అభిషన్‌, జీవిత్‌, అనస్వర రాజన్‌, అజు వర్గేషీ, హరీష్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రేండీ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ మూవీకి మదన్‌ దర్శకుడు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ మూవీ డీసెంట్‌ కలెక్షన్లని రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో సైతం ఆకట్టుకుంటోంది. మంచి వ్యూస్‌ని రాబట్టుకుంటోంది. ఆరో స్థానంలో `స్ట్రేంజర్‌ థింగ్స్` అనే అమెరికన్‌ సిరీస్‌ ట్రెండ్‌ అవుతుంది. ఏడో స్థానంలో కూడా `బ్రిడ్జేర్టన్‌` అనే వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ అవుతుంది.

45
ఎనిమిదో స్థానంలో `జాలీ ఎల్‌ఎల్‌బీ 3` ట్రెండ్‌

ఎనిమిదో స్థానంలో బాలీవుడ్‌ మూవీ `జాలీ ఎల్‌ఎల్‌బీ 3` ట్రెండ్‌ అవుతుంది. అక్షయ్‌ కుమార్‌ నటించిన చిత్రమిది. థియేటర్లలో యావరేజ్‌గా ఆడింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. చాలా రోజులుగా ఇది టాప్‌ 10లో ఉంటుంది. ఇక 9వ స్థానంలో `వన్‌ పీస్‌` అనే సిరీస్‌ ట్రెండ్‌ అవుతుంది.

55
నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10లో తెలుగు మూవీ `అనగనగా ఒక రాజు`

టాప్‌ 10లో పదవ స్థానంలో తెలుగు సినిమా దుమ్మురేపుతోంది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ నెట్‌ ఫ్లిక్స్ లో  ట్రెండ్‌ అవుతుంది. మారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించింది. నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలై బంపర్‌ హిట్‌ సాధించింది. వంద కోట్ల వరకు గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతుండటం విశేషం. ఇండియా వైడ్‌గా ఈ మూవీ సత్తా చాటుతోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories