MSG Final Collections: మన శంకర వర ప్రసాద్‌ గారు ఫైనల్‌ కలెక్షన్లు.. చిరంజీవి మూవీకి లాభం ఎన్ని కోట్లంటే

Published : Mar 09, 2026, 01:41 PM IST

చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `మన శంకర వర ప్రసాద్‌ గారు`. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ థియేటర్లలో క్లోజ్‌ అయ్యింది. ఫైనల్‌గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే. 

PREV
14
రీజినల్‌ ఇండస్ట్రీగా నిలిచిన `మన శంకర వర ప్రసాద్‌ గారు`

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `మన శంకర వర ప్రసాద్‌ గారు`. హిట్‌ మెషిన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే.  సినిమా కోసం ఆడియెన్స్ బండ్లు, ట్రాక్టర్లు కట్టుకొని మరీ వచ్చారు. ఫ్యామిలీలకు ఫ్యామిలీలు కదిలాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. దీంతో రీజినల్‌ ఫిల్మ్‌ లో  ఇది ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసింది.

24
అత్యధికంగా మొదటి రోజు కలెక్షన్లు

చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదలయ్యింది. ప్రారంభం నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదటి రోజు రూ.84కోట్లు వసూలు చేసింది. సీనియర్లలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా నిలిచారు చిరు. ఆ తర్వాత వసూళ్ల వేట కొనసాగింది.

34
మన శంకర వర ప్రసాద్‌ గారు క్లోజింగ్‌ కలెక్షన్లు

దాదాపు నెల రోజుల పాటు ఈ మూవీ మంచి వసూళ్లని రాబట్టింది. యాభై రోజులపాటు థియేటర్లలో రన్‌ అయ్యింది. రోజుకి ఇరవై ముప్పై లక్షలు వసూలు చేసింది. 50 రోజుల వరకు సత్తా చాటిన ఈ సినిమా తర్వాత పూర్తిగా డల్‌ అయ్యింది. రోజుకి లక్ష వరకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో 57రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ.304-305కోట్లు వసూలు చేసింది. ప్రముఖ బాక్సాఫీసు సైట్‌ ప్రకారం ఈ మూవీ ఈ వసూళ్లని రాబట్టింది. దాదాపు రూ.220కోట్ల ఇండియా నెట్‌, రూ.43కోట్లు ఓవర్సీస్‌ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రూ.180కోట్లకుపైగానే షేర్‌ వచ్చినట్టు సమాచారం.

44
మన శంకర వర ప్రసాద్‌గారు మూవీకి లాభం ఎంతంటే?

సినిమాకి రూ.120కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. దాదాపు రూ.70కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రం ఇప్పుడు `జీ 5` ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. అందులోనూ మంచి వ్యూస్‌ సాధించింది. మొదటి వారంలో టాప్‌లో ఉంది. ఇప్పుడు కూడా మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది. నిన్నటి వరకు థియేటర్లలో రన్‌ అయిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో కూడా క్లోజ్‌ అయ్యింది. ఓటీటీలోనే దీన్ని చూడొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories