మిస్‌ వరల్డ్ 2025 టాలెంట్‌ ఫైనల్‌కి 24 మంది సుందరీమణులు.. ఎంపికైన అందగత్తెలు వీరే

Published : May 21, 2025, 01:37 PM IST

మిస్‌ వరల్డ్ 2025 పోటీల్లో టాలెంట్‌ ఫైనల్‌కి జాబితా విడుదల చేసింది 72వ మిస్‌ వరల్డ్ నిర్వాహకుల టీమ్‌. ఫైనల్‌కి 24 మంది అందగత్తెలను ఎంపిక చేశారు. 

PREV
15
కీలక ఘట్టానికి మిస్‌ వరల్డ్ 2025 పోటీలు

మిస్‌ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్‌ వేదికైంది. ఇది మన తెలంగాణ ప్రజలకు గర్వకారణమని చెప్పొచ్చు. సుమారు 20 రోజులపాటు జరిగే ఈ ప్రపంచ అందగత్తెల పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. అందులో భాగంగా లేటెస్ట్ గా కీలక ఘట్టానికి చోటు చేసుకున్నాయి. ఫైనల్‌కి చేరుకున్న జాబితాని విడుదల చేశారు మిస్‌ వరల్డ్ నిర్వాహకులు. ఇందులో మన ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా ఎంపిక కావడం విశేషం.

25
టాలెంట్‌ ఫైనల్‌కి 24 మంది అందగత్తెలు ఎంపిక

దాదాపు వందకు పైగా ప్రపంచ వ్యాప్తంగా సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనగా, క్వార్టర్‌ ఫైనల్‌కి 48 మందిని ఎంపిక అయ్యారు. వారి నుంచి మళ్లీ ఫిల్టర్‌ చేయగా, ఫైనల్‌కి 24 మందిని ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తాజాగా అధికారికంగా ప్రకటించారు. `దాదాపు వంద మంది పోటీదారులు తమ ప్రతిభని, అభిరుచిని, అంకితభావంతో ప్రదర్శించారు. పోటీలకు శక్తిని తీసుకొచ్చారు. 

35
ఈ నెల 23న మరోసారి ప్రదర్శన

ఒక రౌండ్‌ ఆడిషన్లు, అత్యంత పోటీ నెలకొన్న రెండవ రౌండవ కట్‌ తర్వాత 24 మంది అత్యుత్తమ సుందరీమణులను టాలెంట్‌ ఛాలెంజ్‌ ఫైనల్‌కి స్థానాన్ని సంపాదించుకున్నారు.

మళ్లీ వీరు మే 23న మరోసారి ప్రపంచం తరఫున ప్రదర్శన ఇవ్వడానికి వేదికపైకి రాబోతున్నారు. వీరు టాప్‌ 10 స్థానాల్లోకి చేరుకుంటారు. ఫైనలిస్ట్ లు అందరికి అభినందనలు. టాలెంట్‌ ఫైనల్‌కి శుభాకాంక్షలు` అని వెల్లడించింది. 

45
టాలెంట్‌ ఫైనల్‌కి ఎంపికైన 24 దేశాల అందగత్తెలు

వీరిలో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతోపాటు అమెరికా, నైజీరియా, మాల్టా, ఇండోనేషియా, ఈస్తోనియా, బ్రెజిల్‌, నెదర్లాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, శ్రీలంక, కామెరూన్‌, పోలాండ్‌, ఫిలిప్పిన్స్, ఇటలి, త్రినిడాడ్ అండ్‌ టోబాగో, జర్మనీ, కేమాన్‌ ఐలాండ్‌, వేల్స్, జమైకా, ఐర్లాండ్‌, ఈథోఫియా, కెన్యా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ టాలెంట్‌ ఫైనల్‌కి ఎంపికయ్యారు. వీరిని మరో రెండు దశల్లో ఫిల్టర్‌ జరుగుతుంది. గ్రాండ్‌ ఫైనల్‌కి పది మందిని ఎంపిక చేస్తారని తెలుస్తుంది. 

55
మే 31న గ్రాండ్‌ ఫైనల్‌

మే 12న హైదరాబాద్‌లో ఈ 72వ మిస్‌ వరల్డ్ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పోటీలను నిర్వహిస్తుంది. మిస్‌ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ అంతటా తిరిగి టూరిస్ట్ ప్రదేశాలను ఎక్స్ ప్లోర్‌ చేశారు.

 ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్‌ చేశారు. ఈ నెల 31న మిస్‌ వరల్డ్ పోటీలకు సంబంధించిన గ్రాండ్‌ ఫైనల్‌ జరగబోతుంది. విన్నర్‌ ఎవరో ఆ రోజు తేలబోతుంది. ఇందులో ఒక టైటిల్‌ విన్నర్, ఇద్దరు రన్నరప్‌లను ఎంపిక చేస్తారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories