ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. పాన్ ఇండియా హీరోలు సైతం ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాలని చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇండియాలోనే ఫస్ట్ డే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ 10 సినిమాలేంటి? ఏ హీరో ఎక్కువగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ రాబట్టారు? టాప్ 10లో మన తెలుగు సినిమాలున్నాయనేది చూస్తే.
ఫస్ట్ డే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో `పుష్ప 2` మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ డే రూ.294కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది సుమారు రూ. 1900కోట్లు రాబట్టింది.
rrr
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీకి ఏకంగా ఆస్కార్ కూడా వరించింది. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ 2022లో విడుదలైంది. ఫస్ట్ డే ఇది రూ.223కోట్లు చేసినట్టు టీమ్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా లాంగ్ రన్‌లో ఇది రూ. 1200కోట్లు రాబట్టిందని సమాచారం.
Bahubali 2
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన మూవీ, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో `బాహుబలి 2` ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ నటించిన ఈ మూవీ ఫస్ట్ డే రూ.210కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1800కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో ఇది మూడో స్థానంలో నిలిచింది.
ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో మందున్నారు. ఆయన గతేడాది `కల్కి 2898ఏడీ`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ ఫస్ట్ డే 191.5కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇది రూ.1250కోట్లు చేసిందని సమాచారం. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.
రామ్ చరణ్ హీరోగా రూపొందిన `గేమ్ చేంజర్` ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శంకర్ రూపొందించిన ఈ చిత్రం మొదటి రోజు రూ.186కోట్లు రాబట్టిందని టీమ్ ప్రకటించారు. అయితే ఈ ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ట్రోల్ నడుస్తుంది. ఫేక్ అంటూ ప్రచారం జరుగుతుంది. టీమ్ లెక్కల ప్రకారం ఇది ఐదో స్థానంలో నిలిచింది.
`బాహుబలి 2`, `కల్కి` చిత్రాలే కాదు `సలార్`తోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టారు ప్రభాస్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన `సలార్` మూవీ 2023లో డిసెంబర్‌లో వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే రూ.178కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారు రూ.750కోట్లు రాబట్టింది.
`ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ కూడా పెరిగింది. గతేడాది ఆయన `దేవర` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన `దేవర` మూవీ ఫస్ట్ డే రూ.172కోట్లు రాబట్టిందట. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం టోటల్‌గా రూ.500కోట్లు రాబట్టింది. దీనికి పార్ట్ 2 కూడా రాబోతుంది.
హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో టాప్ 7 తెలుగు సినిమాలే ఉన్నాయి. ఆ తర్వాత ఎనిమిదో స్థానంలో కన్నడ మూవీ `కేజీఎఫ్ 2` ఉంది. యష్ హీరోగా నటించిన ఈ మూవీ ఫస్ట్ డే రూ.160కోట్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది టోటల్ రన్‌లో రూ.1200కోట్ల వసూలు చేసిందట. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Leo Movie
తొమ్మిదో స్థానంలో తమిళ సినిమా ఉంది. విజయ్ హీరోగా తెరకెక్కిన `లియో` మూవీ ఫస్ట్ డే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది రూ.148కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్‌లో సుమారు ఆరు వందల కోట్లు రాబట్టిందని సమాచారం. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇక పదో స్థానంలో కూడా తెలుగు సినిమానే ఉంది. అది కూడా ప్రభాస్ మూవీ `ఆదిపురుష్` కావడం విశేషం. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్ డే 140కోట్లు వసూలు చేసింది. డిజస్టార్ అయ్యింది. ఇలా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ టాప్ 10సినిమాల్లో తెలుగువే ఎనిమిది ఉన్నాయి. అందులో ప్రభాస్ మూవీస్ నాలుగు ఉండటం విశేషం. దీంతో డార్లింగ్ నిజమైన పాన్ ఇండియా హీరోగా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
read more: రామ్ చరణ్‌కి అన్యాయం చేసిన శంకర్, `గేమ్ ఛేంజర్` విషయంలో ఆయన చేసిన మిస్టేక్ ఇదే?