నయనతార సక్సెస్ సీక్రెట్.. విజయ రహస్యాన్ని వెల్లడించిన లేడీ సూపర్ స్టార్

First Published | Jan 11, 2025, 4:33 PM IST

తన సక్సెస్ సీక్రేట్ ను వెల్లడించింది సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార ఇంతకీ ఆమెసక్సెస్ సీక్రేట్ ఏంటి..? 

నయనతార

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా  ఉన్న నయనతార నటనతో పాటు నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆమె గత ఏడాది ప్రారంభించిన సంస్థ 'ఫెమీ 9' శానిటరీ నాప్కిన్ సంస్థ. ఈ సంస్థ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మధురైలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నయనతార, పంపిణీదారులు, ఏజెంట్లకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అమ్మకాలు పెంచడంలో కీలక పాత్ర పోషించిన వారిని అభినందించి బహుమతులు అందజేశారు.

నయనతార విజయ రహస్యాలు

ఈ సందర్భంగా నయనతార తన విజయానికి గల కారణాలను, ఎప్పుడూ వదులుకోకూడని రెండు విషయాల గురించి మాట్లాడారు. ఆమె మాటలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నా జీవితంలో నేను ఎల్లప్పుడూ నమ్మే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండవది ఆత్మగౌరవం. ఇవి ఉంటే ఎవరు మనల్ని ఎవరు విమర్శించలేరు అన్నారు. 


ఫెమీ 9 మొదటి వార్షికోత్సవం

ఆత్మవిశ్వాసం పెరగాలంటే మనం నిజాయితీగా కష్టపడాలి. ఎవరేం చెప్పినా, ఎంత నీచంగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా వాటన్నిటినీ పట్టించుకోకుండా నిజాయితీగా కృషి చేయాలి. అప్పుడే ఒకరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని నయనతార అన్నారు. ఈ కార్యక్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా పాల్గొన్నారు.

మహిళలకు స్ఫూర్తినిచ్చిన నయనతార

నయనతార నిర్వహిస్తున్న 'ఫెమీ 9' శానిటరీ నాప్కిన్ సంస్థలో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారు. వారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే నయనతార ఇలా మాట్లాడారని తెలుస్తోంది. గత ఏడాది నయనతార నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది దాదాపు 8 సినిమాల్లో నటిస్తున్నారు. '

నయనతారసినిమాలు

ఈ ఏడాది నయనతార నటించిన కనీసం 5 సినిమాలైనా విడుదలవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నయనతారదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నయనతార నటించి పూర్తి చేసిన 'టెస్ట్', 'మన్నాంగట్టి' సినిమాల చిత్రీకరణ పూర్తయింది. కాబట్టి ఈ సినిమాల విడుదల తేదీలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Latest Videos

click me!