Top 10 Female Stars: ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆసియా టాప్ 10 మహిళా సెలబ్రిటీలు, ఇండియాదే హవా

Published : Nov 17, 2026, 07:45 AM IST

Top 10 Female Stars: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌తో రికార్డు సృష్టించిన ఆసియా టాప్ 10 మహిళా సెలబ్రిటీల జాబితా విడుదలైంది. విశేషమేమిటంటే ఈ లిస్టులో మన హీరోయిన్లదే హవా. మరి ఎవరెవరు ఉన్నారంటే?

PREV
16
అత్యధిక ఫాలోవర్స్ రికార్డ్

ఎక్కువ మంది ఎక్కువ సమయం గడిపే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఇన్‌స్టాగ్రామ్ మారిపోయింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలా చాలా మందికి ఇన్‌స్టాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆసియాలో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న మహిళా సెలబ్రిటీల జాబితా విడుదలైంది. ఈ లిస్టులో మన భారతీయ నటీమణులే ఎక్కువగా ఉన్నారు.

26
ఆసియా మహిళా సెలబ్రిటీల్లో నెం.1 ప్రియాంక

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆసియా మహిళా సెలబ్రిటీల్లో ప్రియాంక చోప్రా రెండో స్థానంలో ఉంది. ఆమెకు ఏకంగా 92.76 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన వారణాసి సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక, హాలీవుడ్ సినిమాల్లోనూ బిజీగా ఉంది. అందుకే ఆమెకు ఇన్‌స్టాలో అంత ఫాలోయింగ్ ఉంది.

36
మహిళా సెలబ్రిటీల్లో నెం.1 ఎవరు?

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా ఆసియాలోనే నెం.1 మహిళా సెలబ్రిటీగా ర్యాపర్ లిసా నిలిచింది. ఈ థాయ్‌లాండ్ ర్యాపర్‌కు ఏకంగా 105 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పూర్తి పేరు లిసా మనోబాల్. లిసా మ్యూజిక్, పాటలు ఎంతో పాపులర్.

46
శ్రద్ధా కపూర్‌కు 3వ స్థానం

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ఇన్‌స్టాలో శ్రద్ధాకు 92.70 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న శ్రద్ధా త్వరలోనే కొత్త రికార్డ్ సృష్టించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

56
జాబితాలో ఆలియా భట్, కత్రినా కైఫ్

టాప్ ఆసియా సెలబ్రిటీల లిస్టులో ఆలియా భట్ 8వ స్థానం దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 85.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సినిమాలకు దూరంగా ఉండి బిజినెస్‌లో బిజీగా ఉన్న కత్రినా కైఫ్‌కు ఇన్‌స్టాలో 78.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

66
ఆసియా టాప్ సెలబ్రిటీల్లో కోహ్లీ నెం.1

ఓవరాల్‌గా ఆసియా టాప్ 10 సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లీ నెం.1 స్థానంలో ఉన్నాడు. కోహ్లీకి ఇన్‌స్టాలో ఏకంగా 271 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రెండో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయనకు 106 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఓవరాల్ జాబితాలో ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలో ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories