Mirnalini Ravi Marriage Photos: తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మృణాళిని రవి.. ఆధ్యాత్మిక వక్త మహా విష్ణును పెళ్లాడింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ మృణాళిని రవి తన అందం, నటనతో కుర్రకారును ఆకట్టుకుంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేసి మెప్పించింది. ఇటీవల ఆమెకి పెద్దగా సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక వక్త మహా విష్ణును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
27
టిక్‌టాక్ స్టార్ నుంచి హీరోయిన్‌గా!
సోషల్ మీడియాలో టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మృణాళిని.. విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఛాంపియన్, ఎంజీఆర్ మగన్, ఎనిమీ, కోబ్రా, రోమియో లాంటి సినిమాల్లో నటించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
37
తెలుగులోనూ పాపులర్
తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ `గద్దలకొండ గణేష్`, `ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు`, `మామా మశ్చీంద్ర` లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
గత ఆగస్టు నెలలో మృణాళిని తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక వక్త మహా విష్ణుతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
57
సీక్రెట్‌గా జరిగిన పెళ్లి
వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇదే ఏడాది ఆగస్టులో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఫైనల్‌గా, నవంబర్ 15 ఆదివారం నాడు మలేషియాలోని అందమైన లంకావి దీవిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు.
67
లంకావి దీవిలో గ్రాండ్ వెడ్డింగ్!
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. విదేశాల్లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను మృణాళిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రేమికులుగా మొదలైన వీరి ప్రయాణం భార్యాభర్తలుగా మారడంతో అభిమానులు ఖుషీ అవుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
77
వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదుగుతున్న మృణాళిని.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతను తీసుకుంది. కొత్త దంపతుల పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండటంతో, సినీ ప్రముఖులు, అభిమానులు వారికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.