పేరుకే చిన్న చిత్రాలు కోట్లలో లాభాలు, నిర్మాతల తలరాతలు మార్చేసిన 10 సినిమాలు ఇవే!

First Published Oct 27, 2024, 6:25 PM IST


ఈ చిత్రాలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తలరాతలు మార్చేశాయి. రూపాయి పెట్టుబడికి పది రూపాయల లాభాలు పంచాయి. ఆ చిత్రాలు ఏమిటో చూద్దాం.. 
 

చిన్న చిత్రాలను బ్రతికుంచుకోవాలి, అప్పుడే పరిశ్రమ మనుగడ సాధ్యమని దాసరి నారాయణరావు వంటి లెజెండరీ డైరెక్టర్ చెప్పారు. ఆయన మాటలకు ఎంత విలువ ఉందో ఈ మధ్య కాలంలో తెలిసొస్తుంది. స్టార్ హీరోలను నమ్ముకొని నిండా మునిగిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లను చిన్న చిత్రాలే కాపాడుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. బింబిసార, కార్తికేయ 2, సీతారామం, కాంతార బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశాయి. అత్యధిక లాభాలు పంచిన టాప్ టెన్ స్మాల్ బడ్జెట్ చిత్రాలేమిటో చూద్దాం. 

విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం బాక్సాఫీస్ వండర్. కేవలం రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్  రూ. 70 కోట్ల షేర్‌ అందుకుంది. మొత్తంగా రూ. 55.43 కోట్ల లాభం అందించింది. 
 

కార్తికేయ 2 సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం అద్భుతం చేసింది. మొత్తంగా రూ. 58.40 కోట్ల షేర్, రూ. 121.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన కార్తికేయ 2 నిర్మాతకు రూ. 45.10 కోట్ల లాభాలు పంచింది. నిఖిల్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించారు. 

2021 లో కొన్ని చిన్న చిత్రాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. వాటిలో ఉప్పెన ఒకటి. కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ జంటగా నటించారు.  రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఉప్పెన ఏకంగా రూ. 51 కోట్ల షేర్ వసూలు చేసింది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మూవీ రూ. 31.02 కోట్ల లాభాలు అందించింది. 

Latest Videos


శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరొక బాక్సాఫీస్ వండర్ ఫిదా. కేవలం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా రూ. 30.5 కోట్ల లాభాలు తీసుకొచ్చాయి. వరుణ్ తేజ్-సాయి పల్లవి జంటగా నటించారు. 

రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సీతారామం మూవీకి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సీతారామం రూ. 16.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  దాదాపు రూ. 46.50 కోట్ల షేర్  వసూలు చేసి రూ. 29.50 కోట్ల ప్రాఫిట్ అందించింది. దుల్కర్ సల్మాన్, రష్మిక, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు చేశారు. 
 


కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ జాతిరత్నాలు మూవీతో మ్యాజిక్ చేశారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన జాతి రత్నాలు రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  చేసింది. రన్ ముగిసే నాటికి రూ. 39 కోట్ల షేర్ రాబట్టింది.ఈ కామెడీ ఎంటర్టైనర్ రూ. 27.52 కోట్ల లాభం తీసుకొచ్చింది. 

దర్శకుడు పూరి జగన్నాధ్ కమ్ బ్యాక్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ షేక్ చేసింది.  రూ. 17.7 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ దాదాపు రూ.41 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 22.78 కోట్ల లాభం తీసుకొచ్చింది. 
 

హిట్టు కోసం ఏళ్లుగా తపస్సు చేస్తున్న కళ్యాణ్ రామ్ కి బింబిసార రూపంలో భారీ విజయం దక్కింది. రూ. 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బింబిసార రూ. 40 కోట్ల షేర్ రాబట్టింది.  ఈ సినిమాతో  రూ. 22 కోట్ల ప్రాఫిట్ దక్కింది. 

విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఇంటెన్స్ లవ్ ఎంటర్టైనర్  రూ. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. అద్భుతమైన రెస్పాన్స్ తో రూ. 26 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా అర్జున్ రెడ్డి రూ. 20.3 కోట్ల లాభం అందించింది. 

కాంతార సంచలనాల గురించి చెప్పడానికి పదాలు చాలవు. కాంతార తెలుగు హక్కులు కేవలం రూ.  2 కోట్లకు అమ్మారు. ఇప్పటికే రూ. 14 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రూ. 16 కోట్ల షేర్ వసూలు చేసింది. అల్లు అరవింద్ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. 

click me!