జబర్దస్త్ ఆమె జీవితాన్నే మార్చేసింది. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలైంది. అంతకు ముందు తెలుగులో పూర్తి స్థాయి కామెడీ షో లేదు. జబర్దస్త్ అనూహ్యంగా ఆదరణ దక్కించుకుంది. అనసూయ ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె గ్లామర్ కి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయ్యారు. అనసూయ గ్లామరస్ యాంకర్ ఇమేజ్ రాబట్టింది.
జబర్దస్త్ అంతకంతకు ఆదరణ పెంచుకుంది. నెంబర్ వన్ బుల్లితెర షోగా అవతరించింది. జబర్దస్త్ షో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను వంటి టాలెంటెడ్ కమెడియన్స్ రాకతో మరింత ఊపందుకుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేశాయి.