ప్రభాస్‌ బావ అని పిలిచే హీరో ఎవరో తెలుసా? ఆ స్టార్‌ హీరోయినే కారణమా?

First Published | Oct 27, 2024, 5:28 PM IST

ప్రభాస్‌ అందరిని డార్లింగ్‌ అని పిలుస్తుంటారు. అందరికి ఆయన కూడా డార్లింగే. కానీ ఒక హీరోని మాత్రం ఆయన బావ అని పిలుస్తాడట. మరి ఆయన ఎవరు? ఆ కథేంటో చూస్తే..
 

ప్రభాస్‌ అంటే డార్లింగ్‌. ఆయన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. అందరికీ ఆయన డార్లింగే. ప్రభాస్‌ ప్రవర్తన, మర్యాద కూడా అలానే ఉంటుంది. ఎంతో అప్యాయంగా ఉంటారు. మర్యాదల విషయంలో తగ్గేదెలే అంటుంటారు. రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడంతో ప్రభాస్‌ రిసీవింగ్ అలా ఉంటుంది. ఎవరినైనా అంతే ప్రేమగా చూస్తారు, ట్రీట్‌ చేస్తారు ప్రభాస్‌. ఆయన ఆ డౌన్‌ టూ ఎర్త్ నేచరే పాన్‌ ఇండియా స్టార్‌ని చేసింది. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా మార్చింది. కోట్లాది మంది అభిమానులను ఇచ్చింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ఎవరినైనా డార్లింగ్‌ అని పిలుస్తుంటారు. తన ఊతపదం కూడా అదే. అయితే ఒక్క హీరోని మాత్రం బావ అని పిలుస్తారట. అది కూడా సీనియర్‌ హీరోని. కారణం ఆయనతో కలిసి సినిమా చేయడమే. అందులో హీరోయిన్‌ కి అన్నగా చేశాడు ఆ సీనియర్‌ హీరో. అలా బావ అని పిలవాల్సి వచ్చింది. అయితే రియల్‌ లైఫ్‌లోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్‌. బయట కూడా ఇద్దరు బావ బావ అని పిలుచుకుంటారట. 


మరి ప్రభాస్‌ బావ అని పిలిచే హీరో ఎవరంటే మోహన్‌బాబు. డార్లింగ్‌ ప్రభాస్‌, మోహన్‌బాబు కలిసి `బుజ్జిగాడు` సినిమాలో నటించారు. ఇందులో చిన్న దొంగగా కనిపిస్తాడు ప్రభాస్‌. మోహన్‌బాబు పెద్ద గ్యాంగ్‌ స్టర్‌ పాత్రలో కనిపించారు. సుఫారీ తీసుకున్న ప్రభాస్‌.. మోహన్‌బాబు ఇంటికి వస్తాడు. అయితే ఆయన చిన్నప్పుడు బుజ్జి అని అమ్మాయిని ఇష్టపడతాడు.

ఇద్దరు ఫ్రెండ్స్. పెద్దాయ్యక కూడా ఆమె తననే ఇష్టపడాలని కోరుకుంటాడు. అది త్రిష అని తెలుస్తుంది. సినిమాలో త్రిష.. మోహన్‌ బాబుకి చెల్లెలు. ఈ విషయం తెలిసి ఆమెని ఆటపట్టిస్తాడు. తనకు లవర్‌ అయినప్పుడు ఆమె అన్న బావనే అవుతాడు. ఆ తర్వాత మోహన్‌బాబుని బావ అని పిలుస్తాడు ప్రభాస్‌. 
 

అయితే సినిమా కోసం చేసిన ప్రాక్టీస్‌ అలానే ఉండిపోయింది. రియల్‌ లైఫ్‌లోనూ అలానే పిలవడం స్టార్ట్ చేశాడట. అప్పుడే కాదు ఇప్పటికీ మోహన్‌బాబుని ప్రభాస్‌ బావనే అని పిలుస్తాడట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి తెలిపింది. ఓ టీవీ షోస్‌లో ప్రభాస్‌తో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని చర్చించింది. ఈ సందర్భంగా ఆమెనే ఈ విషయాన్ని రివీల్‌ చేసింది.

దానికి ప్రభాస్‌ అవును అని చెప్పడం విశేషం. `బుజ్జిగాడు` సినిమా నుంచి అది అలవాటు అయిపోయిందని, ఇప్పటికీ అలానే పిలుస్తానని తెలిపారు డార్లింగ్‌. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించింది లేదు. కానీ వీరిద్దరి మధ్య బావ బావ రిలేషనే ఉంది. కారణం హీరోయిన్‌ త్రిష కావడం విశేషం. 
 

ఇక మోహన్‌బాబు ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. `కన్నప్ప` సినిమాని అన్నీ తానై రూపొందిస్తున్నారు. నిర్మాత తనే, దర్శకత్వం పరంగానూ పర్యవేక్షిస్తున్నారు. మహాదేవ శాస్త్రి అనే పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ చేతిలో ఐదారు సినిమాలున్నాయి. `ది రాజా సాబ్‌` చిత్రీకరణ జరుపుకుంటుంది. హను రాఘవపూడి మూవీ కూడా తెరకెక్కుతుంది. `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు చేయాల్సింది. 

read more: ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ని పోస్టర్‌పై చూసి ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా? తారక్‌ చెప్పిన మాటకి నిర్మాత షాక్‌

also read: కల్కి 2 ఒక్కటే మూడు భారీ చిత్రాలకు సమానం.. నాగ్ అశ్విన్ బిగ్ స్టేట్మెంట్
 

Latest Videos

click me!