యంగ్ హీరోలలో సీనియర్ యంగ్ హీరో అంటే నాని గుర్తుకు వస్తాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హడావిడి చేస్తున్న నాని... కొత్త డైరెక్టర్ని తన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ సారి దసరా సినిమాతో మరో కొత్త దర్శకుడిని ముందుకు తీసుకురాబోతున్నాడు. నానిని సరికొత్తగా చూపించబోతున్నాడు న్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నానికెరీర్ లోనే కంప్లీట్ కాంట్రాస్ట్ గా లుక్ వైజ్, అప్పియరెన్స్ వైజ్ , లాంగ్వేజ్ వైజ్ సరికొత్తగా తెరకెక్కుతోంది. అంతలా నానీని ట్రాన్స్ ఫామ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు శ్రీకాంత్ .