స్టార్ హీరోల కర్మాగారం మెగా ఫ్యామిలీ. టాలీవుడ్ లో పది మంది స్టార్ హీరోలుంటే నలుగురు చిరంజీవి కుటుంబం నుండే వున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్స్ గా వెలిగిపోతున్నారు.
ఇక మెగా హీరోలు మల్టీస్టారర్స్ చేయాలనేది అభిమానుల కోరిక. ఆచార్య మూవీతో వాళ్ళ కోరిక కొంత మేర తీరింది. చిరంజీవి(Chiranjeevi).. ఆయన నటవారసుడు రామ్ చరణ్ కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అత్యంత ఇష్టంగా ఎదురుచూస్తున్న మెగా కాంబో ఒకటి ఉంది. అదే చిరు-పవన్-చరణ్ ల మల్టీస్టారర్. అయితే దానికెంతో సమయం లేదని తెలుస్తుంది.
27
ఈ ముగ్గురు మెగా హీరోలను ఒకే మూవీలో చూసే అదృష్టం సాకారం కానుంది. ఆచార్య (Acharya)మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ చిరంజీవి, చరణ్, దర్శకుడు కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. చిరంజీవి తనకు ఇష్టమైన రీమేక్స్ గురించి చెప్పాడు.
37
దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి చిత్రాలు రీమేక్ చేయాలని ఉంది. కారణం... ఈ మధ్య కాలంలో నేను కామెడీ పండించిన చిత్రాలు రాలేదు. కాబట్టి ఆ చిత్రాల్లో కామెడీ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ చిత్రాలు రీమేక్ చేయాలని భావిస్తున్నాను, అని చిరంజీవి చెప్పారు.
47
చిరంజీవి, పవన్- రామ్ చరణ్ (Ram Charan)కలిసి నటించే ఛాన్స్ ఉందా? అని హరీష్ అడిగారు. దానికి ఎప్పుడూ సిద్ధమేనని చిరంజీవి తెలిపారు. భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో గెస్ట్ రోల్ చేయడానికి నేను, చరణ్ సిద్ధమే అన్నారు. మీరు కోరితే పవన్ భవదీయుడు చిత్రంలో తళుక్కున మెరవడానికి రెడీగా ఉన్నట్లు చిరంజీవి, చరణ్ దర్శకుడు హరీష్ కి హామీ ఇచ్చారు.
57
Pawan Kalyan
వారిద్దరూ పవన్ మూవీలో కనిపిస్తారంటే సినిమాకు మరికొంత హైప్ వచ్చి చేరుతుంది. ఈ ఛాన్స్ దర్శకుడు హరీష్ వదులుకోకపోవచ్చు. పవన్ ఒప్పుకుంటే తన స్క్రిప్ట్ లో చిన్న మార్పు చేసి చరణ్, చిరు కనిపించేలా ఏర్పాటు చేస్తారు. కనుక మెగా హీరోలు ముగ్గురూ భవదీయుడు భగత్ సింగ్ మూవీలో కనిపించే అవకాశాలను కొట్టిపారేయలేం.
67
గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ మూవీలో పవన్ కనిపించారు. సాంగ్స్ లో ఆయన తళుక్కున మెరిశారు. తర్వాత ఆయన మెగా హీరోల చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవు. మరోవైపు భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagath singh)త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
77
ఇక భవదీయుడు భగత్ సింగ్ తో పాటు తమిళ్ హిట్ మూవీ తేరి రీమేక్ లో పవన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారట. ఇక చాలా కాలం క్రితమే సురేందర్ రెడ్డితో పవన్ ఓ మూవీ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పై తర్వాత ఎటువంటి అప్డేట్స్ లేవు, దీనితో ఈ చిత్రం అటకెక్కినట్లు టాక్ వినిపిస్తుంది.