మన హీరోల లేటెస్ట్ పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

Published : Sep 03, 2020, 03:21 PM IST

ఒక సినిమా హిట్‌ అయ్యిందంటే చాలు హీరోలు తమ రెమ్యూనరేషన్‌ అమాంతం పెంచేస్తుంటారు. సూపర్‌ స్టార్స్ రెమ్యూనరేషన్‌ గురించి చెప్పాల్సి వస్తే.. సినిమా బడ్జెట్‌లో సగం పారితోషికం వారికే చెల్లించాల్సి వస్తుంది. మరి ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారో ఓ లుక్కేద్దాం..  

PREV
17
మన హీరోల లేటెస్ట్  పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

ప్రస్తుతం హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌లో డార్లింగ్‌ ప్రభాస్‌ ఫస్ట్ స్థానంలో ఉన్నారు. ఆయన `బాహుబలి` చిత్రానికిగానూ వంద కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. ఇప్పుడు `సాహో`, ప్రస్తుతం నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రాలకు రూ.80కోట్లకుపైగా తీసుకుంటున్నారు. ఇక నాగ్‌ అశ్విన్‌, బాలీవుడ్‌ చిత్రం `ఆదిపురుష్‌` చిత్రాలకు వంద కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. 

27

ప్రభాస్‌ తర్వాత ఆ స్థానం సూపర్‌ స్టార్‌ మహేష్‌కి దక్కుతుంది. ఆయన ఒక్కో సినిమాని యాభైకోట్లకు పైగా పారితోషికంగా పుచ్చుకుంటున్నారు. `సరిలేరు నీకెవ్వరు` సినిమా భారీ కలెక్షన్లని రాబట్టడంతో ఇప్పుడు ఆయన ఏకంగా ఎనభై కోట్లు రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని టాక్‌. 

37

మూడో స్థానం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి దక్కుతుంది. ఆయన `అజ్ఞాతవాసి` తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాడు. ఇప్పుడు `వకీల్‌సాబ్‌`లో నటిస్తున్నారు. ఈ సినిమాకి రూ.50కోట్లు పారితోషికంగా దిల్‌రాజు ఇవ్వబోతున్నారట. అంతేకాదు ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు టాప్‌ ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండటం విశేషం. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయితే పవన్‌ పారితోషికం ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ని దాటిపోయినా ఆశ్చర్యం లేదు. 

47

ఇక ఆ తర్వాత స్థానాల్లో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నిలుస్తారు. ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకుని విడుదలైన బన్నీ  `అలా వైకుంఠపురములో` చిత్రం `బాహుబలి` తర్వాత హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్‌ పెంచారు. ప్రస్తుతం నటిస్తున్న `పుష్ప` చిత్రానికి 35 నుంచి 40కోట్ల వరకు ఇస్తున్నట్టు టాక్‌. 

57

ఇక ఎన్టీఆర్‌ సైతం ప్రస్తుతం ఆయన నటిస్తున్న `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్రానికి రూ.35 కోట్ల నుంచి నలభై కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఇదే బాటలో రామ్‌చరణ్‌ కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న `ఆర్‌ఆర్‌ ఆర్‌`కి కూడా దాదాపు రూ. 35కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్టు టాక్‌. 
 
67

ఇక సీనియర్‌ హీరోల్లో మెగాస్టార్‌ పారితోషికంపై క్లారిటీ లేదు. ఆయన రీఎంట్రీ తర్వాత సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీలో `ఆచార్య` సినిమా చేస్తున్నారు. దీనికిగానూ ఆయన భారీగానే పారితోషికంగా ఇస్తున్నట్టు టాక్‌. ముప్పై కోట్లకుపైగా ఉంటుందని భోగట్టా.  సీనియర్‌ హీరోల్లో చిరంజీవినే టాప్‌ అని చెప్పొచ్చు. 

77

ఇక పది కోట్లకుపైగా పారితోషికం నాని, విజయ్‌ దేవరకొండ అందుకుంటున్నారు. నాగార్జున, రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, శర్వానంద్‌, రామ్‌, గోపీచంద్‌, రాజశేఖర్‌, నాగచైతన్య, అఖిల్‌, మంచు హీరోలు వంటి హీరోలు పది కోట్ల లోపు పారితోషికంగా తీసుకుంటున్నారు. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories