ప్రభాస్,చిరు,రామ్ చరణ్, పవన్ షూటింగ్ లో స్టార్ హీరోలు బిజీ బిజీ.. ఎవరెక్కడ షూటింగ్ చేస్తున్నారంటే..?

Published : May 17, 2022, 07:18 AM IST

స్టార్ హీరోలంతా ఎవరి షూటింగ్స్ లో వారు బిజీ బిజీగా ఉన్నారు. అయితే అందరూ హైదరాబాదు చుట్టుపక్కలే తమ షూటింగ్స్ చేసుకుంటున్నారు. భాగ్యనగరం నలుమూలల షూటింగ్ చేసుకుంటున్న స్టార్ హీరోలెవరు.. ఎక్కడెక్కడ షూటింగ్స్ జరుగుతున్నాయి చూద్దాం.

PREV
18
ప్రభాస్,చిరు,రామ్ చరణ్, పవన్ షూటింగ్ లో స్టార్ హీరోలు బిజీ బిజీ.. ఎవరెక్కడ షూటింగ్ చేస్తున్నారంటే..?

ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, పవన్ అంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. తమసినిమాకు తగ్గ లొకేషన్లలో బిజీబిజీగా షూట్ చేసుకుంటున్నారు. ఒక్క విజయ్ దేవకొండ మాత్రం అవుడోర్ షూటింగ్  తో ఎంజాయ్ చేస్తున్నాడు. షూటింగ్ గ్యాప్ లో షికారు చేస్తున్నాడు.  

28

ప్రభాస్ నాగ్ అశ్విన్ దీపిక పదుకొనె కాంబినేషన్ లో.. భారీ బడ్జెట్ తో  రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ మూవీ షూటింగ్ ఖానాపూర్ లో జరుగుతుంది. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నాడు నాగ్. 
 

38

ఇక మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా  డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చిందనే చెప్పాలి. మలయాళ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శంకర్ పల్లి సెట్ లో జరుగుతుంది.
 

48

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం  రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో  ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు మూవీ టీమ్.
 

58

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర విరమల్లు సినిమా.. సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ మూవీ  షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది.
 

68

రామ్ చరణ్ తో కొత్త సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు శంకర్. ఈసినిమా కంప్లీట్ చేసి వెంటనే గౌతమ్ తిన్ననూరితో మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు చరణ్. ప్రస్తుతం  సినిమా షూటింగ్ హైదరాబాద్ గోల్కొండ దగ్గర జరుగుతుంది

78

ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. షూటింగ్ గ్యాప్ లో నేచర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. 

88

ఇక మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ మూడ్ లో ఉన్నాడు. ఆయన హీరోగా  నటిస్తున్న రావణా సుర  సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories