ఎలక్షన్ ఎఫెక్ట్.. సామాన్యుల్లా సెలబ్రిటీలు,మేకప్ లేకుండా మెరిసిన టాలీవుడ్ స్టార్స్..

First Published | Nov 30, 2023, 5:46 PM IST

తెలంగాణలో ఎలక్షన్స్ జోరు కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సామాన్యులతో పాటు స్టార్ సెలబ్రిటీలు కూడా తమ హక్కును వినియోగించుకున్నారు. సెలబ్రిటీలు కూడా సామాన్యుల్లా క్యూలో నిలుచోవడంతో పాటు.. ఎప్పుడూ మేకప్ తో కలకళలాడే వారు..మేకప్ లేకుండా సింపుల్ గా దర్శనం ఇచ్చారు. 

ఓటింగ్ కు పోటెత్తారు సెలబ్రిటీలు. హైదరాబాద్ లో వివిధ పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎప్పుడు సినిమాల్లో ఫుల్ మేకప్ తో కనిపించే తారలు.. చాలా సింపుల్ గా.. సాధారణ పౌరుల మాదిరి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కొంత మంది అయితే క్యూలైన్ లో చాలా సేపు నిలుచుని మరీ ఓటు వేశారు. 

ముఖ్యంగా మేకప్ లేకుండా ఓరిజినల్ లుక్ లోకనిపించిన వారిలో మహేష్ బాబు నమ్రత కూడా ఉన్నారు. వీరిద్దరు  జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఇద్దరు తారులు చాలా సింపుల్ గా.. ఏమాత్రం మేకప్ లేకుండా.. సామాన్య ఓటర్ల మాదిరి కనిపించాయి.


ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సింపుల్ గా కనిపించారు ఆయన అయ్యప్ప మాలలో ఉండటంతో.. నల్ల బట్టలు ధరించి చాలా సింపుల్ గా కనిపించారు. రామ్ చరణ్ మాత్రం కాస్త ఆర్బాటంగానే వచ్చారు. ఇతర తారలు చాలా వరకూ సింపులుగానే కనిపించారు. 
 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చాలా సింపుల్ గా కనిపించారు. ఏమాత్రం మేకప్ లేకుండా వచ్చిన తారక్.. తన భార్య, తల్లితో కలిసి క్యూ లైన్ లోనిలుచుని మరీ ఓటు వేశారు. ఫోటోలు వీడియోలు తీస్తున్న వ్యక్తిని ఉద్దేశించి మీరు ఓటు వేయరా.. అంటూ ప్రశ్నించాు తారక్.. వేయనంటూ అతను చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది. 

Allu Arjun

బన్నీ కూడా చాలా సింపుల్ గా వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. పుష్పగడ్డంతో మిలమిల మెరుస్తున్న అల్లు అర్జున్. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో.. వైట్ టీషర్ట్ వేసుకుని కనిపించారు. ఆయన సింపుల్సిటీ చూసి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. 
 

ఇక నేచురల్ స్టార్ నానీ కూడా చాలా అంటే చాలా సింపుల్ గావచ్చి ఓటు వేశారు. సామాన్యుడిలా క్యూలైన్ లో నిల్చుని.. అక్కడ ఉన్నవారితో మాట్లాడుతూ.. నాని చాలి సింపుల్ గా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా ఏమాత్రం హార్బాటం లేకుండా చాలాసింపుల్ గా వెళ్ళి ఓటు వేసి వచ్చారు. 

ఇక కింగ్ నాగార్జున్ కూడా తన ఫ్యామిలీతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగచైతన్య, అమలతో పాటుగా వచ్చి ఓటువేశారు నాగ్. అయితే నాగ్ గుబురు జుట్టు, గెడ్డంతో రా లుక్ లో ఉన్నారు. ఇక నాగచైతన్య కూడా ఏమాత్రం మేకప్ కాని.. హడావిడి కాని లేుకుండా సింపుల్ గా కనిపించారు. 

ఇక స్టార్స్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన ఓటు హక్కును వినియోగించుకన్నారు. మేకప్ అదీ లేకపోయినా.. డ్రస్సింగ్ లో చాలా హడావిడి కనిపించింది. 

యంగ్ హీరో నితిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఆంజనేయ మాలలో ఉన్నారు. కాబట్టి సింపుల్ గా వచ్చి.. కామన్ మెన్ లా ఓటు వేసి వెళ్లిపోయారు. నితిన్ తో పాటు  సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు సింపుల్ గా వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. 

Latest Videos

click me!